ఆట పాటల సరాళ కేళి తరంగాలలో
తేలేది బాల్యం
రాగానురాగాల సమ్మేళన యవ్వనం
ప్రేమానురాగాల సమ్మోహన కలయిక
సంసార బంధం!
నాది… నా వాళ్ళు అనే…
వ్యామోహబంధమే బిడ్డలు
శ్రమైక్య పరుగుల జీవనమే నడివయస్సు
బంధానుబంధాల క్రమమే
మనిషి జీవనగమనము
ఆ గమన క్రమాలతో మిళితమైన
జీవన చక్రములో అలసి సొలసి
ఒడలిన వయస్సులో
అనుభవసారాల జలనిధిలో మునిగి
తడిసి ముద్దయినదే ముసలితనము!
ప్రకృతి మాత ఒడిలోకి
తిరిగి చేరేదే మనిషి మహా ప్రస్థానం
ఎంతో విచిత్రమైన జీవి ప్రయాణం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి