బడి :- నారి నరేష్ మస్కట్- ఒమన్
సాహితీ కళాపీఠం.
సాహితీ కెరటాలు..
==============
బడికి వెళ్ళాము బాల్యంలో,
అక్షరాలను ఆత్మసాతం చేసాము,
చదువు  తోడునీడగా మారింది.

గురువు చూపిన దారి అనుసరించాము,
క్రమశిక్షణ మార్గం నేర్చుకున్నాము,
స్నేహబంధాలలో మమేకమయ్యాము,

ఆటల్లో మనిషితనాన్ని పుట్టించాము,
బహుమతులలో ఉత్సాహం వెలిగింది,
చప్పట్లతో పేరుపేరున పలికారు,

కలసికష్టపడి విజయం సాధించాము,
మార్కులలో ఆశయాలను చూశాము,
అవి చిరునవ్వుగా రూపాంతరం అయ్యాయి.

సంతోషాన్ని పంచుకుంటూ నడిచాము,
ఆనందాన్ని గుండెలలో నింపుకున్నాము,
సాధించామన్న భావన మదిలో విరిసింది,
ఇంకా ముందుకు సాగుదాం అనిపించింది....


కామెంట్‌లు