ధనము-గుణము..!:- కాకర్ల రమణయ్య- గుడిపాటిపల్లి
 సాహితీ కవికళాపీఠం
సాహితీ కెరటాలు 
============
ఆకలిని తీర్చునది - భోగమును కూర్చునది..!
ఆర్భాటము అందించునది – ఆరోగ్యమును కొనునది..!
శోభను పెంచునది -సోకుకు సొగసులు అద్దునది..!
హోదాను పెంచునది -హొయలు గోలుపునది..!
చదువులకు చేయూత నివ్వునది – చందమామను చేతికి అందించునది..!
అద్దముల మేడను ఇచ్చునది – అద్ద మంత మనసు లేనిది ...!
ఐశ్వర్యమునకు జత కూడునది – ఆత్మసాక్షిని చంపి వేయ గలిగినది..!
ధనము దాని నామము – ధనవంతుల వెట్టి దాని ఖర్మము ...!
ధనమునకు దూరముగా ఉండునది – ఆత్మాభిమానం హెచ్చుగా కలిగినది..!
పేదవానికి పెన్నిది – సహృదయులకు ఆత్మ భందువు..!
పిల్లలతో చెలిమి చేయునది – ఖర్మలకు తలోగ్గనిది...!
ప్రలోభాలకు లొంగనిది – ప్రతీకారాలు కోరనిది....!
దొడ్డ మనుషులలో ఉన్నది –దొడ్డి దారిన రానిది...!
అత్తలోన ఉండిన – కలతలు లేని కాపురము...!   
కోడలి లోన ఉండిన – కుటుంభమే నందనవనం...!
ఆస్తులు పెరిగినా తరగదు –హోదాలు వచ్చినా మురవదు...!
దాని నామమే గుణము – దాని లక్ష్యమే లోక కళ్యాణం ..!

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
సూపర్ మెసేజ్ సార్ మీరు ఇలాగే రాస్తూ వుంట అని నా కోరిక
అజ్ఞాత చెప్పారు…
Supper sir
అజ్ఞాత చెప్పారు…
మంచి మెసేజ్ ఇస్తూ సమాజం లోని మంచిని పెంచండి మామ
అజ్ఞాత చెప్పారు…
మంచి మెసేజ్ ఇస్తూ సమాజం లోని మంచిని పెంచండి మామ