చిట్టిపొట్టి బాలల కధలు -4
====================
అదో పెద్ద ఇల్లు! ఇంటి చుట్టూ ప్రహరీ గోడ. ఖాళీ స్థలంలో వరసగా నిమ్మ, మామిడి, జామ, సపోటా పండ్ల చెట్లున్నాయి. వాకిలి వైపు గోడ పక్కన మందార, నందివర్ధనం, కస్తూరి వంటి కాస్త పెద్ద మొక్కలూ, కుండీల్లో బంతీ చామంతి ,కనకాంబరం, గులాబీ పూల మొక్కలను పెంచడం ద్వారా ముంగిట్లో అందంగా ఉంటుందని ఇంటి యజమాని విఠల్ రావు గారి అభిప్రాయం.
ఓ మూల పాదుల్లో సన్నజాజి తీగలను పందిరి వేసి పాకించారు. ప్రతీ సాయంత్రం బోలెడు మొగ్గలు ఆకుల చాటునుండి దూసుకువస్తాయి.
అన్నీ ఓపికగా కోసి సజ్జలో వేసి ఆడపిల్లలకి దారపు ఉండతో సహా ఇస్తారు ఆయన.
ఆ యింటి యజమాని ఏదో పనిమీద వేరే ఊరికి వెళ్లి చాలా కాలం తిరిగి రాలేదు. పనిమనిషి నీళ్లు పోస్తున్న ప్పటికీ మొక్కలు పూయడం లేదు.
వరండాలో ఉన్న విఠల్ గారి మడతకుర్చీ, చిన్న అరుగుతో మాట్లాడుతున్నది.
" చూసావా అరుగమ్మా! వసంతకాలంలో కూడా ఈ మొక్కలు పూయడం లేదు. !"
"అవునoడీ! మడతకుర్చీ గారూ! విఠల్ గారి చేత్తో వేసిన మొక్కలే ఇవన్నీ. ఆయనకే తెలుసు ఏ మొక్కకి ఎన్ని నీళ్లు ఎలా పోయాలో! పసిపిల్లలకి స్నానం చేయించినట్టూ చెయ్యి అడ్డం పెట్టీ పాదులో పోస్తారు ఆయన. ఈ పని మనిషి నిర్లక్ష్యంగా దబ్బున చెంబుతో కుమ్మరిస్తున్నది మొహంలో విసుగుతో. " అన్నది అరుగు.
"హుమ్మ్! ఎత్తి పోసేసరికి నాజూకు మొక్కల మొదట్లో వేళ్ళూ బైట పడ్డాయి. నీరు పెద్దగా అవసరంలేని మొక్కలకీ రోజూ పోసేసరికి కుళ్ళి పోతున్నాయి!" విచారంగా అంది మడతకుర్చీ.
ప్రహరీకి పైన పెట్టిన కుండీల్లో సీతమ్మ జడకుచ్చులు మొక్కనుండీ వేలాడిపోతూ..., పొద్దు తిరుగుడు పూలు సూరీడు వైపు తిరగడం కూడా సరిగా లేదు.
"విఠల్ గారి చేత్తో పండు ఆకులూ ఎండు రెమ్మలూ ఎప్పటికప్పుడు తొలగించి, మొక్కల మీద వర్షం జల్లుల్లా కొంత నీరు పోసి సంతోషపడేవారూ. అందుకే అవీ పచ్చగా చల్లగా దుమ్ము ధూళి లేకుండా, కొత్త చిగుళ్ళు మొగ్గలతో ఆనందంగా ఉండేవి. ఎప్పుడు వస్తారో మరీ?!" అన్నది చిన్నఅరుగు.
"ఈ చెట్లు దిగులు పెట్టుకున్నాయేమో? ఉగాది పోయినా మామిడి పూత లేదూ. జగదీశ చంద్ర బోస్ అనే ఆయన చేసిన పరిశోధనల్లో చెట్లకి ప్రాణం ఉందని కనిపెట్టారుటా చాలా కాలం క్రితమే! " నవ్వింది మడత కుర్చీ.
"అవునూ మిత్రమా! మొక్కలూ నిరీక్షిస్తూ ఉన్నాయి!!" అని నిట్టూర్పు విడిచింది చిన్నరుగు!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి