మా అమ్మఙ్ఞాపకాలు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అమ్మను 
ఉరంతా గౌరవించేవారురా
అమ్మను
శుభకార్యాలకు తప్పకపిలిచేవారురా

అమ్మను
ఎదురురమ్మనే వారురా
అమ్మను
దీవించమని కోరేవారురా

అమ్మను
దేవతలా చూచేవారురా
అమ్మను
ఆరాధించే వారురా

అమ్మకు
స్వాగతం పలికేవారురా
అమ్మకు
ప్రణామాలు చేసేవారురా

అమ్మకు
పిల్లలంటే ప్రేమరా
అమ్మకు
ఇల్లంటే స్వర్గసీమరా

అమ్మకు
వారసులపై ప్రేమరా
అమ్మకు
అభివృద్ధిపై అపేక్షరా

అమ్మను
తలచుకుంటుంటా
అమ్మను
మెచ్చుకుంటుంటా

అమ్మ
మా ఇంటిదేవతరా
అమ్మ
మా ఉన్నతికికారకురాలురా


కామెంట్‌లు