బాధ్యత :- పార్లపల్లి నాగేశ్వరమ్మ-నెల్లూరు

 సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
============
బాధ్యత అనే కొమ్మలకు
ఆధారం బంధాలు
బంధాలు బలంగా ఉంటే 
బాధ్యతలు భారరహితంగా ఉంటాయి 
కుటుంబంలో మనుషుల మధ్య బాధ్యతలు సహజమే 
సమాజం కూడా ఒక కుటుంబమే 
సామాజిక బాధ్యత కలిగి ఉండడం కూడా ముఖ్యమే 
పర్యావరణం మన రక్షక కవచం 
ఉంది ప్రతి ఒక్కరి మీద కాపాడాల్సిన అవసరం 
రాజ్యాంగం లో ఉన్నాయి హక్కులు బాధ్యతలు 
ఎక్కువ మంది చేస్తున్నారు హక్కుల కోసం పోరాటాలు 
బాధ్యతలు విస్మరిస్తే గమనాలు అగమ్యాలు
లేదు లేదు బిడ్డ పట్ల తల్లి బాధ్యత  గుర్తు చేయాల్సిన అవసరం 
కానీ నేడు తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు మారుతున్నాయి భారంగా
ఈ వింత పోకడలతో మన సంస్కృతికి అయింది విరుద్ధంగా
మార్జాల న్యాయం మర్కట న్యాయం 
తెలుసుకొని మెలిగితే మన అందరం 
బాధ్యతలలో పాటించగలం సమతుల్యం

కామెంట్‌లు