సుప్రభాత కవిత : - బృంద
చీకటి తల్లి ప్రసవించిన 
వెలుగుల బాలుని మెరుపులు
పుడమికి తోడిగెను ప్రేమగా 
పుత్తడి తొడుగులు అందంగా!

పుట్టిన బాలుని కళ్లారా చూసి
పట్టుకున్న  తల్లి హృదయపు 
పెల్లుబికే మమకారానికి 
కొలిచే సాధనం వుంటుందా!

మేలుకొలిపే వేకువకు 
మేలుకున్న వసుమతి 
మేలైన వెలుగుల వానలో 
మేలిమి ముత్యమల్లె తోచదా!

చలి దుప్పటి తోసేసి 
నులివెచ్చగా తాకేసే
తొలి కిరణపు నెయ్యాలు
ఇలతో చేసే సయ్యాటలేగా!

వేచిన మదికి  వేడుకగా 
వేంచేసిన మనసైన నేస్తంగా 
వేలుపు తానే సాకారంగా 
వేదన తీర్చగా  ఏతెంచెనుగా!

వేవేల వర్ణాల స్వప్నాలన్నీ 
సత్యమై మురిపించు క్షణాలను 
నిత్యమూ మనకోసం పోగుచేసి 
కాంతి పూసల మాల కూర్చి తెచ్చే 

విలువైన ఉదయానికి 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు