*నాన్న వారసురాలిని*నేను :- పార్లపల్లి నాగేశ్వరమ్మ-నెల్లూరు

 సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
=============
మూర్తిమత్వం 
మానవత్వం 
దాతృత్వం 
నాన్న నాకు పంచి ఇచ్చిన 
అమూల్యమైన వారసత్వం 
నాకెంతో గర్వకారణం
నాన్న ఆస్తి కి వారసులు తోబుట్టువులందరూ
మూర్తిభవించిన ఆయన మహోన్నత 
కార్యాచరణాలకు  వ్యక్తిత్వానికి
వారసురాలు నేనే అవ్వాలని భావిస్తాను ఎల్లప్పుడు
పునికి  పుచ్చుకున్నాను 
అక్షరాలా నీ లక్షణాలన్నీ 
నేను వేసే ప్రతి అడుగుకి మార్గదర్శకం నాన్న పెంపకం 
సర్దుబాటుతనం నీలోని మహోన్నత గుణం 
అలాంటి గొప్ప లక్షణాలు ఇచ్చిన 
లబ్ద ప్రతిష్ట కలిగిన వ్యక్తి మీరు 
తీర్చుకోవాలన్న తీరని రుణం 
క్షమాగుణం జాలి దయ దానధర్మం 
అతిధి అభ్యాగతి అన్ని గుణాల సమాహారం 
నీ నుండి సంక్రమించిన ప్రతి లక్షణం  నాకు వరం
అజాత శత్రువు నాన్న నువ్వు 
నీలాగే నా చుట్టూ ఉన్న వారంతా నాకు మిత్రులే
ఆనందాన్ని పంచడమే తెలిసిన వారు నాన్న 
దుఃఖాన్ని ఎవరికీ ఇవ్వడం తెలియదు నాకు నాన్న 
ప్రేమించడానికి కారణాలు వెతుకుతాడు నాన్న
ఎవరిని ద్వేషించడం తెలియదు నీలాగే నాకు కూడా  నాన్న 
నేను క్షమించడాన్ని చేతగానితనం అంటున్నారు అందరూ 
అది నీ నుంచి నాకు సంక్రమించిన గొప్ప ఆస్తి
అని భావిస్తాను నేను నిరంతరం
ఎప్పటికీ ఎన్నటికీ నీ కూతురు లాగే పుట్టాలని భగవంతుని ప్రార్థిస్తూ
కామెంట్‌లు