మా వూరెటూ!?:- ఎం. వి.ఉమాదేవి

 చిట్టి పొట్టి బాలల కథలు -7

----------------------------------
 ఓ నాలుగు కాలిబాటల కూడలిలో ఓ బోర్డు పడున్నది. ఆ దారుల్లో పోయే వారు ఎవరూ ఆ బోర్డు సరిగా పెట్టే ప్రయత్నం చేయడం లేదు. 
అప్పుడే బస్ దిగి బ్యాగుతో అటుగా వెళ్తున్న ఓ అమ్మాయి దాన్ని పైకెత్తి పట్టుకుంది. దానిపై చింతవరం  అని రాసి ఉంది. మరి ఏ దారి చింతవరం చూపుతుంది అని అర్థం కాలేదు. అడిగినా అక్కడున్న చిన్నపిల్లలు పట్టించుకోలేదు. దాంతో ఆ అమ్మాయి ఓ రాయి మీద కూర్చుని, ఒక్కో వైపు నుండీ వచ్చే వాళ్ళని ఏ ఊరు నుండీ వస్తున్నావు అని అడుగుతూ ఉంది. కాసేపటికి నాలుగు వైపుల వారూ కూడా "చింతవరం నుండి వస్తున్నాం!" అని చెప్పేసరికి ఆ పిల్లకి పిచ్చెక్కి పోయింది. 
కాసేపటికి అటుగా వెళ్తున్న ఓ పశువుల కాపరినీ " ఏం తాతా! ఈ నాలుగు దార్లు చింతవరంకే అని ఎలా చెప్పారు అందరూ?" అని అడిగింది.
అప్పుడా తాత నవ్వి " ఈ ప్రదేశం గ్రామానికి బొడ్రాయి తల్లీ! " అని చెప్పి చక్కా పోయాడు!!
(బొడ్రాయి అంటే ఊరు మధ్యలో ప్రత్యేక సందర్భాల్లో పూజలు చేసే ముఖ్యప్రదేశం. దానికి అటూ ఇటూ ఉన్నది ఊరే! )
కామెంట్‌లు