వీర జవాన్లకు శతకోటి వందనం :- బి స్వాతి కరుణాకర్ - హైదరాబాద్
 సాహితీ కవి కళా పీఠం 
సాహితీ కెరటాలు 
===============
సింధూరం ప్రతి హిందూ మహిళకు మంగళప్రదం 
ఎంతో పవిత్రంగా భావిస్తారు భారతీయులు ఈ ఆచారం 
తెలుగింటి ఆడపడుచుకు ఇదే ఐదవతనం 
ఉగ్రవాదుల కాల్పులలో కోల్పోయారు సౌభాగ్యం 
మాయమైపోయింది నుదుటిపై సింధూరం ఇది ఎవరు చేసిన నేరం... 
అమాయక జీవుల మతోన్మాద బలిదానం ఇది ఎక్కడి పాపం...
ఈ దుర్మార్గంతో ప్రతి భారతీయుడి గుండెల్లో రగిలెను అగ్నికణం 
వీర సైనికుల తుపాకుల నుండి దూసుకెళ్ళేను తూటాల సమూహం 
ముత్తైదుల ఆత్మఘోషకు తీర్చుకుంటున్నారు ప్రతీకారం 
ఇది భారతీయ వీర జవాన్లు చేస్తున్న అలుపెరుగని సమరం 
ఇదే మోడీ గారి ఆదర్శవంతమైన నాయకత్వంతో జరుగుతున్న పోరాటం 
పడతి సింధూరానికి ప్రతీకగా చేస్తున్నారు ఆపరేషన్ సింధూరం 
దీనికై ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు మన వీర సైనిక దళం 
వీరమరణం పొందిన భరతమాత ముద్దు బిడ్డలకు నా శతకోటి వందనం.

కామెంట్‌లు