ఒక్క పలకరింపు:- సత్యవాణి

 హలో ...,!
అనే నీ ఒక్క పలకరింపు ఆ నెలంతా నాకు వెయ్యి బలంటానిక్కులు తాగినంత శక్తినిస్తుంది
ఉత్సాహాన్నిస్తుంది
ముందుకు ఉరుకుతున్న నా వయసును
ఒక ఏడాది వెనక్కునెడుతుంది
ఒక్క ఫోన్ కాలు
'హలో!'
ఒకప్పుడు ఉత్తరం చేరడానికి
'అంచ తపాలా '
తరువాత
పోష్టల్లో ఉత్తరం చేరాలంటే
వారంపదిరోజులు
ఒక్క టెలీగ్రామ్ కి రెండుమూడు రోజులు
ఒక్క ట్రంకాల్ కి
కొన్నిగంటల నిరీక్షణ
కానీ నువ్వు మనసు పెడితే
ఒక్క 'హలో!' అదిచాలు
లేదా ఒక్క ఈ 🤝ఎమోజీ పెట్టు అదే పదివేలు
ఉడిగిన శక్తి ఉరుకులుపెడుతూ వెనక్కి వస్తుంది
ఎమోజీ ఏనా పెట్టునాన్నా!
అందుకు నువ్వు వెచ్చించే సమయం
లిప్తపాటుమాత్రమే
నామనసు అర్థంచేసుకొంటావని              
 ఆశిస్తూ 
                 నీ నాన్న
కామెంట్‌లు