నీ దౌర్జన్యం, దోపిడీ....
ఆ శ్రామిక శక్తి సహనం కోల్పో నంత వరకే...!
ఆ శ్రమ సాగరంలో నీ ఆనంద విహారాలన్నీ...
అది ఉప్పెనై విరుచుకు పడనంత వరకే...!
ధన, అధికార మదంతో...
నీవుపశుబలాన్నిప్రదర్శిస్తే ,... చలిచీమల చేత జిక్కిన పాము వై పొగలవ్....!
ధర్మ బద్దం గా... న్యాయ సమ్మతమైన...వారి శ్రమకు తగ్గ వేతనాన్ని వారికిచ్చేస్తే...
నీ కోట్లే మైనా కరిగి పోతాయా..!?
నీ మితి మీరిన స్వార్థానికి వేలమందిని ఉసురు పెడతావా...?!
ఇతరులను ఆనంద పరచటం లోనే నీ ఆనంద ముంటుందని తెలుసుకో!
నీ ఆస్తుల నెవరికీ ఉదారంగా దారపోయ నవసరం లేదు....ఆ నిర్భాగ్య శ్రామికుల శ్రమను దోచుకో కుంటే చాలు...!
నీవు సుఖించు,నీ చుట్టూ ఉన్నవారిని సుఖపడ నివ్వు..., నివానందంగా బ్రతుకు...తోటి మనుషు లనూ ఆనందంగా బ్రతకనివ్వు...!
చుట్టూ ఉన్నవారిని దుఃఖ పెట్టి, నీవు ఆనందంగా ఉండా లనుకుంటే...,
ఆ ఆనందం తాత్కాలికమే...!
పర్యవసానం... శాశ్వత దుఃఖమే...!!
శ్రమ శక్తిని ప్రేమించు....
గౌరవించు....ఆదరించు,
సుఖించు... ఆనందంగా జీవించు...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి