ప్రతి సాహిత్యాభిమాని ఒక సంఘజీవి!

 సమాజాన్ని పరిశీలిస్తూ, సంఘంలో గల మూఢనమ్మకాలనే రుగ్మతలను పారద్రోలాలని, సంస్కరణలతో కూడిన పురోగతిని చేకూర్చాలని రచయితలు కృషి చేస్తారని, సంఘజీవులై నిలుస్తారని ప్రముఖ సాహితీవేత్త పొట్నూరు కోటిబాబు అన్నారు.  
స్థానిక విజ్ఞాన భారతి పాఠశాల ఆవరణలో నిర్వహించిన కొత్తూరు రచయితల వేదిక రెండోనెల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా కోటిబాబు మాట్లాడుతూ ఆనాటి స్వాతంత్ర్య సమరంలో ప్రజలను చైతన్యపరిచే విధంగా, దేశభక్తిని పెంపొందించే విధంగా సాహితీవేత్తల గీతాలు ఎంతగానో దోహదపడినట్లు ఆయన గుర్తుచేశారు. అనేక దురాచారాలను రూపుమాపేందుకు, ప్రజలను కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దేలా చైతన్యపరిచేందుకు ఈ సాహిత్యం ఎంతగానో తోడ్పడునని కోటిబాబు అన్నారు. వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కుదమ తిరుమలరావు సమన్వయంతో, నిర్వహించిన కవిసమ్మేళనంలో కుదమ తిరుమలరావు వందనం, కలమట శ్రీరాములు భాషా ఔన్నత్యం, డా.యెన్ను అప్పలనాయుడు మాతృభాష నినాదం, ముదిల శంకరరావు జాతీయ పతాకం, పెదకోట ధనుంజయరావు శ్రమజీవి, గడసాపు ఉషారాణి వీరజవాను, ఎవిఆర్ఎం రాజా దిలీప్ పట్నాయక్ భాషకు వెలుగు 'కొరవే', గేదెల మన్మధరావు ఆపరేషన్ సిందూర్, బూరాడ గణేష్ అభిమతం అను కవితలను వినిపించి అందరి ప్రశంసలు పొందారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథి పొట్నూరు కోటిబాబును, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవి కవయిత్రులను శాలువాలతో గ్రంథాలతో వేదిక ఘనంగా సన్మానించింది. అనంతరం ప్రతిభావంతులుగా ఎంపికైన బాలబాలికలు సాసుబిల్లి జయంతి, ఉర్లాపు శశిధర్, యు.భువనేశ్వర్, ఆరి మితిల, ఎ.పూర్ణచంద్ర, ఎ.బేబిశ్రీ, రౌతు నైనిష, వండాన సహశ్రీ, బొమ్మన లిశిత, గోరుశెట్టి ధనుష్, వండాన కీర్తనలను ప్రోత్సహిస్తూ వేదిక సభ్యులు ముదిల శంకరరావు కాపీబుక్స్ ను బహూకరించారు. సభ్యురాలు గడసాపు ఉషారాణిచే తర్ఫీదు పొందిన మూడో తరగతి చిన్నారులు బౌరి మనీష్ కుమార్, బి.అజయ్ లు సంకేత అవధానం ప్రక్రియను గావించి, అందరినీ అబ్బురపరిచారు. అనంతరం మనీష్, అజయ్ లను అభినందిస్తూ శంకరరావు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కుదమ తిరుమలరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో దుక్క గణపతిరావు, సి.హెచ్.మార్కో, బౌరి మురళి, బి.పద్మ, జన్ని నాగరాజు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు