ఉచ్చింత తీగ. :- తాటి కోల పద్మావతి

 ఇది అగ్నిదమనీ జాతికి చెందిన తీగ చెట్టు. ఉచ్చింత తీగను"ముళ్ళ ముష్టి"చెట్టు అని కూడా పిలుస్తారు. డొంకల మీద పొదల మీద తీగలాగా పాకుతూ కనిపిస్తుంది. ఇది గోదావరి గట్ల పైన ఉన్నది. దీని ఆకులు వాకుడు చెట్టు ఆకులను పోలి ఉండి ఆకులు కాండం కూడా చిన్నచిన్న ముళ్ళతో పోలి ఉంటుంది. పువ్వులు కుంకుడు గింజల ఉండి గుత్తులుగా కాస్తాయి. అవి పండితే ఎరుపు రంగులో ఉంటుంది. కాయలలో గింజలు నిండా ఉంటాయి. ఈ మొక్క విశిష్టత ఏమిటంటే ఇది వరుగు చేసి వాటిని మసి చేసి దాన్ని పిప్పళ్ళు కలిపి తీసుకుంటే బ్రామ్ ఖైటిస్ పూర్తిగా తగ్గిపోతుందిట. అంతేకాక ఈ మొక్క క్యాన్సర్ వ్యాధిని తగ్గించే గుణం కలిగి ఉన్నట్లు ఇటీవల పరిశోధకులు వెల్లడించారు. 
.
కామెంట్‌లు