నాన్న నాకు రక్ష:- అద్దంకి లక్ష్మి ముంబై
గజల్
====

నన్నుచూసి చిరునగవులు
 చిందించిరి మానాన్నా
 నా జన్మకు మూలముగా 
 గర్వించిరి మానాన్నా 

తొలిఅడుగులు వేయించీ 
  బ్రతుకుబాట నడిపించిరి
 నీడలాగ వెన్నంటీ
  మురిపించిరి మా నాన్నా 

 ఎండవాన తగులకుండ
 గొడుగు పట్టి వెనుక నిలచు 
 అనుదినము నా తోడుగ
 మసలు కొనిరి మా నాన్నా

పదములనూ పలికిస్తూ
 అక్షరములు నేర్పించిరి
 తొలి గురువుగ పాఠములను 
బోధించిరి మా నాన్నా

రేయిపగలు వెన్నంటీ
 వెన్నలాంటి మనసుఉంది
 బ్రతుకుబాట భయమన్నది
 తొలగించిరి మా నాన్నా

కామెంట్‌లు