ఆడిస్తూ కాలం గెలిచిందా?
ఓడిపోతూ నేనే గెలిచానా?
ఉరిస్తూ ఆశ గెలిచిందా?
ఎదురు చూస్తూ నేను గెలిచానా?
జడిపిస్తూ కలతలు గెలిచాయా
భయపడుతూ నేను గెలిచానా?
సమస్యలనిస్తూ సమయం గెలిచిందా
సర్దుకుంటూ నేను గెలిచానా?
చుట్టుకుంటూ చీకటి గెలిచిందా
తట్టుకుంటూ నేను గెలిచానా?
వదిలేస్తూ బంధం గెలిచిందా
పట్టుకుంటూ నేను గెలిచానా
చెరిపేస్తూ దూరం గెలిచిందా
నడుస్తూ నేను గెలిచానా?
గడిపేస్తూ జీవితం గెలిచిందా
తడిపేస్తూ మౌనం గెలిచిందా?
తవ్వేస్తూ కలహాలు గెలిచాయా
భరిస్తూ బంధం గెలిచిందా?
కవ్విస్తూ కలలు గెలిచాయా
నవ్వేస్తూ నేను గెలిచానా?
గిచ్చేస్తూ కోపం గెలిచిందా
నచ్చేస్తూ ప్రేమ గెలిచిందా?
తప్పిస్తూ స్నేహం గెలిచిందా
ఒప్పిస్తూ తప్పే గెలిచిందా?
పరుగులు తీస్తూ కాలం గెలిచిందా
పరిగెత్తుతూ మనం గెలిచామా?
వలేసే అవకాశం గెలిచిందా
వదిలేసి నీతి గెలిచిందా?
కరిగిపోతూ కొవ్వొత్తి గెలిచిందా?
వెలుగిస్తూ వత్తి గెలిచిందా?
తిమిరాన్ని తరిమేసి వెలుగు గెలిచిందా?
వెలుగులో కలిసిపోయి చీకటి గెలిచిందా?
ప్రశ్నల్లో జవాబులున్నాయా?
జవాబులే ప్రశ్నలయ్యాయా?
నేటికి రేపు అవకాశం అయితే
ఆ రేపటికి నిన్న ఓ అనుభవం అంతే!
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి