విధి రాసిన రాతనో తెలియదాయె
మనుషులు మదిలో చేసేటి గాయాలో తెలిదాయె
కరెన్సీ నోటుకోసమై నిలువునా చిదిమేస్తూవుంటే
మానవత్వంతో నిండిన హృదయాన్ని ముక్కలు చేస్తూవుంటే
రుజువులేని నిందలను నిత్యం అత్తరులా చల్లుతుంటే
గాయపడిన గుండెలోగిలి కన్నీటితో సేద దీరుతుంది
జాలీలేని మనుషులుతో నిత్యము దగా పడుతూనే
అనురాగంతో అభిషేకించిన పెదాలు నిందెలతో వెంటాడుతుంటే
మది తలచని ఇష్టాలకు బలి పశువువై జీవచ్చవమై బ్రతుకుతున్నా!
యెన్నో సార్లు విసిగిపోయి ప్రశాంత కోసమై పోరాడుతూ ఓoటరినై నిలుస్తున్నా
కలిసి వచ్చే కాలం కోసమై నిత్యము వేసి చూస్తూనే
భవిష్యత్తును నిలువునా చిదిమెసే మానవ మృగాలను మానత్వoతో మన్నిస్తూ
చరిత్రలో చేరిగిపోని పేజీ కోసమై నిత్యము శ్రమిస్తూనే
నేనే ఉదయించే ఓ విప్లవ గీతమై జీవిస్తున్నా!!
చిరువవ్వును ముద్దాడుతూ నిత్యము విజయాలను ఆస్వాదిస్తూ
నిలువునా గాయాల లోగిలిలో నిలుస్తున్నా !!
డా.ధనాశి ఉషారాణి
కథ రచయిత్రి సింగర్
నూతన ప్రక్రియల రూపకర్త
కలము పేరు సిరిరాగ
భాకరాపేట తిరుపతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి