నీ హృదయం ఒక దేవాలయం..!:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్
చిమ్మ చీకటి 
నీ గుండెను చీల్చలేదు... 

పండు వెన్నెల
నీ గుండె నిండా నిండి ఉంటే...

పగ ప్రతీకారాలు 
చింతలు చీకాకులు
అసూయా ద్వేషాలు
నీ గుండెను బలహీన పరచలేవు...

ప్రేమ 
అనురాగం 
ఆప్యాయత 
నీ గుండె నిండా పొంగి పొర్లుతుంటే...

అశాంతి 
అవమానం 
ఒత్తిడి బాధ
వ్యధ వేదన 
మానసిక క్షోభ 
ఏవీ నీ గుండెను పిండిచేయ లేవు...

భగవంతునిపై
భక్తి శ్రద్దల వలయమైతే
ప్రశాంతత కు నిలయమైతే
ఏదైనా తట్టుకోగలనన్న 
దృఢమైన నమ్మకం విశ్వాసం 
నీ గుండెలో వెలిగే దీపాలైతే
నీ గుండెనే దేవాలయమవుతుంది


కామెంట్‌లు