సాకీ: నీతి, జాతిలేని తీవ్రవాద మూకల రాక్ష సత్వానికి బలై పోయిన
ఓ భారత పౌరులారా... తీర్చెదముప్రతీకారము ,
కలిగించెదము మీ ఆత్మలకు శాంతి...! 2
పల్లవి :-
వెంటాడి, వేటాడి దుష్టులను దునుమాడి
మన భారత సత్తాను చాటి చెప్పుదాము...
మనం చాటి చెప్పుదాము
ఈ ప్రపంచానికి మనం చాటి,చెప్పుదాము...!
"వెంటాడి, వేటాడి....!"
చరణం:-
నుదుట సింధూరముదిద్ది ముష్కరులనుహతమార్చి ,
మనవీరజవానులు , విజయులై తిరిగిరాగ....
ఆశీర్వదించి సమరానికిపంపుదము!!
"వెంటాడి,వేటాడి...!"
చరణం:-
మన శక్తినే కాదు ,యుక్తినీ ప్రదర్శించి...శత్రువులను మట్టుబెట్టి,
ప్రపంచ దేశాలముందు సహభాస్ అనిపించుకుని ,
మన విజయకేతనం గగనతలంలో ఎగుర వేద్దాము...!
మనం ఎగుర వేద్దాము!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి