పక్క పక్కనే పక్కలో నిద్రకు మేం ఇద్దరం
చీకటి కదా
రాత్రికి భయంలేదు
నన్ను నిద్రపోనీయదు
వాన్నీ కుదురుగా కునుకు తీయనీదు
ఇప్పుడిక్కడ చీకటి రాజ్యం ఏలుబడిగా
అయినా, నిద్రకు చీకటిదోస్తీ ఏందో
ఏ అలికిడిలేని రాత్రి
మేం కలలుగనకుండా
తప్పు తనదికాదంటూ చీకటి
రాత్రిపై
రాత్రి మాత్రం నాదికాదని నిద్రపై నెపం
కోపం ముంచుకొచ్చేలోగా
భళ్ళున తెల్లారే
చీకటీ రాత్రీ నిద్రా పరార్
కమ్మని కలొక్కటే నా గుండెనిండా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి