ఆర్థిక అసమానతలు రూపుమాపాలి:-సి.హెచ్.ప్రతాప్

 గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో తీవ్ర ఆర్ధిక అసమానతలు నెలకొంటున్నాయి.  భారత దేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైనా, అదే సమయంలో తీవ్ర స్థాయి ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటున్న దేశాల వరుసలో కూడా ముందే ఉంది. గత మూడున్నర దశాబ్దాలుగా ఈ అసమానతలు తారాస్థాయికి చేరాయి. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలు, పూర్వీకుల నుంచి సంక్రమించిన సంపద—ఇవి రెండూ కలిసి దేశ సంపదలో సింహ భాగాన్ని సంపన్నుల చేతుల్లో కేంద్రీకరణకు దోహద పడుతున్నాయి. భారత జనాభాలో అగ్రశ్రేణి 10% మంది మొత్తం జాతీయ సంపదలో 77% కలిగి ఉన్నారు. 2017లో ఉత్పత్తి చేయబడిన సంపదలో 73% అత్యంత ధనవంతులైన 1% మందికి వెళ్ళగా, జనాభాలో సగం మంది పేదలుగా ఉన్న 670 మిలియన్ల భారతీయుల సంపదలో కేవలం 1% పెరుగుదల మాత్రమే కనిపించింది అని ఒక నివేదిక తెలియజేస్తోంది.
ఈ క్రమంలో పేదలు కనీస వేతనం సంపాదించడానికే కాక, నాణ్యమైన విద్యా‑ఆరోగ్య సేవలు పొందటానికీ తీవ్రంగా కష్టపడుతున్నారు. ఒకవైపు సొంత సామర్థ్యానికంటే వేగంగా సంపద చేరగొడుతున్న వారితో పోల్చుకుంటే, పేదలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై పెట్టుబడి చాలా తక్కువ స్థాయిలోనే ఉంటుంది. మంచి ఆరోగ్య సంరక్షణ ఇప్పుడు డబ్బున్నవారికి మాత్రమే అందుబాటులో ఉన్న విలాసవస్తువులా మారింది. దేశం వైద్య పర్యాటక రంగంలో అగ్రస్థానంలో ఉన్నా, భారతదేశంలోని వెనుకబడిన రాష్ట్రాల్లో శిశు మరణాల రేటు ఉప‑సహారా ఆఫ్రికాను కూడా మించిన స్థాయిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలలో భారతదేశం 17% మరియు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణాలలో 21% కలిగి ఉంది.
ఈ పెరుగుతున్న విరూపిత అంతరాలు మహిళలు, పిల్లలు వంటి సున్నిత వర్గాలను మరింతగా ప్రభావితం చేస్తున్నాయి—వారి ఆరోగ్య, విద్యా, భద్రతా అవకాశాలను మరింత కుంగదీస్తున్నాయని గుర్తించాల్సిన అవసరం ఉంది.పేదలకు ఇంకా రోజుకు రెండు సార్లు పట్టెడన్నం దొరకడం కష్టం గా వుంటే ఉన్నత వర్గాల జీత భత్యాలు, పర్యవసానం గా జీవిత విధానం భారీగా పెరుగుతున్నాయి. దెసం లో మీశ్రమ ఆర్ధిక వ్యవస్థ వున్నప్పుడు పేద, గొప్పల మధ్య ఆర్ధిక అసమానతలు ఎంత తక్కువగా వుంటే అంత మంచిది. ప్రముఖ ఆర్ధిక శాస్త్రవేత్త అమర్త్య సేన్ పేద వర్గాలకు ప్రాజారోగ్యం బాగుంటే, వారికి ఆర్ధికపరం గా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వుంటేనే దేశ ఆర్ధిక స్థితి బాగునట్ట్లు అని ,కాగితాలపై కనిపించే జి డి పి వృద్ధి రేటు యొక్క ఫలితాలు పేదలకు అందినప్పుడే నిజమైన దేశాభివృద్ధి సాధించినట్లు అని సిద్ధాంతీకరించారు. ప్రపంచీకరణ నేపధ్యం లో ఉన్నతాదాయ వర్గాలకు మరింత ఆదాయం పెర గటం, ప్రభుత్వ సిబ్బందికి ఉన్నత స్థాయి వేతనాలుండటం... వారంతా వినియోగ వస్తువుల్ని భారీగా కొనుగోలు చేయటం వగైరాల వల్ల వస్తు వినిమయం భారీగా పెరిగినట్టు గణాంకాల్లో తద్వారా జి డి పి లో వృద్ధి నమోదు అవుతునట్లు , ఇది నిజమైన అభివృద్ధికి సంకేతం కాదని ఆయన అభిప్రాయపడుతున్నారు. గత పదేళ్లలో ఉపాధిరంగం, వ్యవసాయ పారిశ్రామిక రంగం అతి తక్కువ వృద్ధి రేటును నమోదు చేసాయి . ప్రభుత్వ పరం గా ఎన్ని చేయూత అందించినా ఆటోమొబైల్ రంగం లోఒ అభివృద్ధి అంతం మాత్రమే. నిరుద్యోగం ఏ ఏటి కా యేడు 7 శాతం పెరుగుతోంది. నిరక్ష్యరాస్యత లో తగ్గుదల అంతంత మాత్రమే. ప్రాణాంతక వ్యాధులు విజృభిస్తుండడం తో అమాయకులు ప్రతీ ఏడు ముఖ్యం గా గ్రామీణులు ప్రతీ సంవత్సరం పది లక్షల దాకా 

ప్రాణాలు కోల్పోతున్నారు.ప్రజారోగ్యం పూర్తిగా పడకేసింది. 1993 నుండి 2012 మ ధ్య జి డి పి నాలుగు రెట్లు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. కాని పేదల జీవితాలలో చెప్పుకోదగిన మార్పులు రాలేదు.ఈ మధ్య కాలంలో ఉన్నత వర్గాల ఆదాయం నాలుగు ఎట్లు పెరగగా కార్మీక వర్గానికి వేతం రెట్టింపు మాత్రమే అయ్యింది .  దేశంలో కార్మికుల పని పరిస్థితులు సక్రమంగా లేవని, వేతనాలు నాసిరకమని, ఆ వేతనాలివ్వటంలో లింగ వివక్ష ఇప్పటికీ పోలేదని, మెరుగైన వేతనాలు కేవలం పట్టణ ప్రాంతాల్లోని స్వల్ప సంఖ్యలో ఉన్న కార్మికులు లభిస్తున్నాయి తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి లేదని ఈమధ్యే అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) వెల్లడించింది. ప్రభుత్వాలు ప్రకటించుకుంటున్న జి డి పి వృద్ధి రేటు యొక్క ఫలాలు అంతిమం గా సంపన్న వర్గాలకు మాత్రమే చెందుతున్నాయి గాని బడుగు జీవులకు, శ్రామిక వర్గాలకు ఏ మాత్రం లభించడం లేదు. దేశం లో పేదరికం ఇంకా 62 శాతం మందిని పట్టి పీడిస్తోంది. ఒక పక్క మానవులు విలాసవంతమైన కార్లలో తిరుగుతూ వుంటే మరొకపక్క పట్టెడన్నం దొరకక దేశం లో ఏటా రెండు లక్షల ఆకలి చావులు సంభవిస్తున్నాయి. సమాజం లో ఆర్ధిక అసమానతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. వీటిని సరిదిద్ది అందరి  జీవితాలలో వెలుగులు నింపినఫ్ఫుడే సమగ్ర ఆర్ధికాభివృద్ధి సాధించినట్లు అవుతుంది. తాజా వివాదం సంగతెలా ఉన్నా ఉపాధి అవకాశాలు పుంజుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుని ఆర్థిక రంగానికి జవసత్వాలు కల్పించాల్సిన అవసరం ఉంది
కామెంట్‌లు