విశాఖపట్నం మద్ధిలిపాలెం కూడలి వద్ద ప్రాథమిక విద్యాస్థాయి మాతృభాష తెలుగులోనే జరగాలని తెలుగుదండు వ్యవస్థాపకుడు పరవస్తు ఫణిశయన సూరి అర్ధనగ్న ప్రదర్శన చేసారు ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు రచయితలు,కవులు ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, ఆచార్య కొచ్చెర్లకోట సూర్యనారాయణ, ఆచార్య సూరప్పడు, పద్యకవి రచయిత చిన సూర్యనారాయణ మరియు తెలుగు భాష అభిమానులు పాల్గొన్నారు
రేపు విద్యాశాఖామంత్రి లోకేష్ కు వినతి పత్రం సమర్పిస్తామన్నారు. మహానాడు లో తప్పక తెలుగు భాష ను ప్రాథమిక స్థాయిలో అమలు పరిచే నిర్ణయం వస్తుందని,తాము ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని ప్రాథమిక విద్యా స్థాయిలో మాతృభాష ఉంటే అవగాహన కలిగి ధారణ శక్తి పెరుగుతుందని మీడియా ప్రతినిధులకు చెప్పారు.
..............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి