విశ్వామిత్రుడు హిందూ పురాణాల్లో ప్రఖ్యాత ఋషి. ఆయనను రాజర్షి, మహర్షి, బ్రహ్మర్షి వంటి బిరుదులతో వివిధ ఇతిహాసాల్లో—రామాయణం, మహాభారతం, భాగవతంలో పేర్కొన్నారు. గాయత్రి మంత్ర రచయితగా, శ్రీరామునికి గురువుగా, హరిశ్చంద్రుని పరీక్షించిన ఋషిగా, త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవానిగా, శకుంతల తండ్రిగా మరియు భరతునకు తాతగా గుర్తింపు పొందారు.
విశ్వామిత్రుని జీవిత విశేషాలను గౌతమ మహర్షి, అహల్యల కుమారుడైన శతానందుడు శ్రీరామునికి వివరిస్తాడు. ఈ వర్ణన వాల్మీకి రామాయణంలోని బాలకాండంలో 51వ సర్గ నుంచి 65వ సర్గ వరకు ఉంటుంది. బ్రహ్మ కుమారుడు కుశుడు, అతని కుమారుడు కుశనాభుడు. కుశనాభుడికి నూరుగురు కుమార్తెలు పుట్టగా, ఆయన వాటిని బ్రహ్మదత్తుడికి వివాహం చేస్తాడు. అనంతరం తనకు పుత్రసంతానం లేకపోవడంతో పుత్రకామేష్టి యాగం నిర్వహిస్తాడు. ఆ యాగ ఫలితంగా కుశ మహారాజు ప్రత్యక్షమై, పరాక్రమశాలి మరియు కీర్తిశాలి పుత్రునిగా గాధిని ప్రసాదిస్తానని వరమిస్తాడు. ఈ గాధి కుమారుడే విశ్వామిత్రుడు. కుశ వంశంలో జన్మించినందున ఆయన ‘కౌశికుడు’ అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందారు.
భారతదేశంలో అత్యంత గౌరవనీయులైన ఋషుల్లో విశ్వామిత్రుడు ఒకరు. ఆయన ఋగ్వేదంలోని మండల 3 లోని బహుళ భాగాలకు, ముఖ్యంగా గాయత్రి మంత్రానికి మూలకర్తగా పేరుపొందారు. పురాణాల ప్రకారం, ఈ మంత్రం యొక్క సంపూర్ణ అర్థం కేవలం 24 మంది ఋషులు మాత్రమే గ్రహించగలిగారు. వీరిలో తొలి ఋషి విశ్వామిత్రుడు, చివరి ఋషి యాజ్ఞవల్క్యుడు. రాజుగా పుట్టిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారే ముందు తన రాజ్యాన్ని త్యజించారు. అందుకే ఆయన 'రాజర్షి' అని కూడా ప్రసిద్ధి చెందారు.మనందరికీ విశ్వామిత్ర మహర్షి ప్రసాదించిన గొప్ప వరం గాయత్రి మంత్రం. "విశ్వామిత్ర ఋషిః గాయత్రీ ఛందః" అని ప్రతి రోజు సంధ్యావందనంలో ఉచ్చరిస్తాం. ఇది ఋషి స్మరణ. గాయత్రి మంత్రం ‘త్రిపదా షట్‌కుక్షిః’ అనే విధంగా నిర్మితమైన సంపూర్ణ మహామంత్రం. దీని మహత్త్వం ఎంతో అద్భుతం. మూడు వేదాలను పారాయణ చేసిన పుణ్యానికి సమానంగా గాయత్రి మంత్రాన్ని జపించడమే ఫలితమివ్వగలదని పెద్దలు చెబుతారు. త్రిమూర్తులే కాక, వారి శక్తులు, ప్రకృతి తత్వం, పరబ్రహ్మ స్వరూపమంతా దీనిలో నిగూఢంగా ఉన్నాయి. ఇది ఆద్యంతరహితమైనది, రక్షాకరమైనది. గాయత్రి మంత్రం ఉపదేశమే మనిషిని ద్విజునిగా, పశువును కూడా విప్రునిగా మారుస్తుంది. ఇంత శక్తివంతమైన మంత్రానికి ఋషి విశ్వామిత్రుడే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి