న్యాయాలు-864
"జన వాక్యం తు కర్తవ్యమ్" న్యాయము
****
జనము అనగా మనుష్యులు, ప్రజలు, లోకులు. వాక్యం అనగా ఒక ఆలోచన,భావం లేదా సందేశము, పదాలను ఒక నిర్దిష్ట క్రమంలో అమర్చడం. తు అనగా అయినా, అయినప్పటికీ,అంతేకాక.కర్తవ్యమ్ అనగా చేయదగినది,కోయదగినది, నాశము చేయదగినది అనే అర్థాలు ఉన్నాయి.
"జనులు నలుగురూ అన్నట్లు చేయవలెను" తప్పదు అనే అర్థంతో ఈ న్యాయమును మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
ఈ వాక్యము వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ప్రజాకవి వేమన శతకములోని పద్యము.అదేమిటో చూద్దాము.
"పదుగురాడు మాట పాటియై ధర జెల్లు/ఒక్కడాడు మాట ఎక్కదెందు/ ఊరకుండు వాని నూరెల్ల నోపదు/ విశ్వధాభిరామ వినురవేమ!"
అనగా ఎక్కువ మంది మాట్లాడే మాటకే విలువ ఉంటుంది.ఒక్కడు చెప్పే మాట ఎప్పటికీ చెల్లదు.అలాగే అటూ ఇటూ కాని తటస్థుడిని ఎవరూ పట్టించుకోరని ఈ పద్యం యొక్క భావము. కాబట్టి ఎప్పుడూ ఒంటరిగా, తటస్థుడిగా ఉండకూడదని వేమన ఈ పద్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు.
ఒక విషయం గురించి తీసుకునే నిర్ణయంలో పదిమంది అభిప్రాయం ఒకేలా ఉన్నట్లయితే తప్పయినా,ఒప్పయినా అదే చెలామణి అవుతుంది. దానికే విలువ ఉంటుంది.ఇలా చెప్పడంలో రెండు రకాలైన కోణాలను మనం చూడవచ్చు.
ఒక కోణంలో పదిమంది తీసుకునే నిర్ణయం చాలా వరకు మంచిగానే ఉంటుంది.అది ఎప్పుడంటే మానవీయ విలువలు కలిగిన మేధావి వర్గం తీసుకున్నప్పుడు. ఆ నిర్ణయం అందరికీ మేలు చేస్తుంది.దాని వల్ల ఎవరూ నష్టపోరు.ఇది కుటుంబానికి కూడా వర్తిస్తుంది. ఏదైనా నిర్ణయం చేయాలంటే ఇంటిల్లిపాదీ ఒకటికి పదిసార్లు ఆలోచించి ఓ నిర్ణయానికి వస్తారు.తద్వారా దాని వల్ల కలుగబోయే మంచి, చెడులు, లాభనష్టాలు ఇవన్నీ చర్చకు వస్తాయి. తీసుకునే నిర్ణయం పటిష్టంగా ఉంటుంది.ఫలితాలు కూడా ఆ విధంగానే ఉంటాయి.
ఇక రూపాయి బిళ్ళకు బొమ్మా , బొరుసు ఉన్నట్లుగా దీనినే మరో కోణంలో చూసినట్లయితే...
పూర్వం గ్రామాల్లో కొందరు అంగబలం , అర్థబలం ఉన్న వ్యక్తులు పెద్దమనుషులుగా చలామణి అవుతూ వుండే వారు. ఊరిలో ఏ సమస్య వచ్చినా ఏ రచ్చబండ దగ్గరో, ఆయా పెద్ద మనుషుల చావిడిలోనో పంచాయతీ నిర్వహించే వారు.అందులో బాధితుల అభిప్రాయాలకు ఎలాంటి విలువా ఉండేది కాదు. వేమన అన్నట్లు అన్యాయం జరిగిందని బాధితుడు చెప్పే మాట కంఠశోష అయ్యేది.ఆ పెద్దమనుషుల మాటే తుది తీర్పుగా అమలు అయ్యేది. దాని వల్ల బాధితులకు ఎలాంటి న్యాయం జరిగేది కాదు. ఎందుకిలా? అని ప్రశ్నించే హక్కు ధైర్యం బాధితులకు ఉండేది కాదు.అలా ఈ "జన వాక్యం తు కర్తవ్యమ్" న్యాయము అన్యాయమై పోయేది.
ప్రస్తుత పరిస్థితులు చూస్తున్న మన పెద్దవాళ్ళు ఈ విషయంలో చాలా వ్యాకులత చెందుతున్నారు.ఎందుకంటే దుష్ట ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఓ గ్యాంగుగా తయారై అటు సమాజానికి ఎంతో ద్రోహము చేస్తున్నారు. ఇటు రక్షణ వ్యవస్థకు సవాల్ గా నిలుస్తున్నారు.
కాబట్టి కత్తికి రెండువైపులా పదును ఉన్నట్లు ఈ న్యాయమునకు రెండు వైపులా పదును ఉందని మనం అర్థం చేసుకోవచ్చు.కాబట్టి ఓ నిర్ణయం తీసుకునే విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలి. అందరినీ మెప్పించలేక పోయినా ఎవరూ నష్ట పోకుండా ఉండేందుకు మన వంతుగా న్యాయము ,ధర్మం వైపు నిలిచి వాటిని కాపాడేందుకు నలుగురిని కలుపుకుని ప్రయత్నించాలి. ఇదే ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి . నాతో ఏకీభవిస్తారు కదూ!.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి