హస్తినాపురానికి పాండవుల దూతగా వెళ్ళాడు శ్రీకృష్ణుడు. పరంధాముడిని భీష్మాచార్యులు సాదరంగా ఆహ్వానించారు.
ఎంతో దివ్యంగా భవ్యంగా కనిపిస్తున్న భవంతిని చూసి ఇది ఎవరిది అని అడిగాడు కృష్ణుడు.
ఇది నా భవనమే. మీరొస్తున్నారని దీనిని నేనే అలంకరించానన్నాడు భీష్ముడు.
కృష్ణుడు ఏమీ మాట్లాడక మౌనంగా ముందుకు కదిలాడు.
ఆ భవనానికి పక్కనే మరొకటి. అది మరింత వైభవంగా కనిపించింది. ఇది ఎవరిది అని అడిగాడు. ఇది నా ఇల్లే అన్నాడు ద్రోణుడు. ఇక్కడ అన్ని వసతులూ ఉన్నాయి. మీరు బస చేయడం కోసం నేనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసానన్నాడు ద్రోణుడు. అయితే అక్కడికీ వెళ్ళక కృష్ణుడు ముందుకు అడుగులు వేశాడు. దుశ్శాసనుడి ఇల్లు ఈ రెండిళ్ళకన్నా మరింత వైభవంగా కనిపించింది. ఈ ఇంటిని మీ రాక కోసం నేనే దీనిని ఉల్లాసపురిగా మార్చానన్నాడు దుశ్శాసనుడు. కానీ ఆ మాటలను కృష్ణుడు చెవికెక్కించుకోలేదు. ఇలా పెద్దల గొప్పలేవీ కృష్ణుడికి అస్సలు నచ్చలేదు. ఆ ప్రాంతంలోనే ఓ చిన్న పూరిపాకను చూసాడు కృష్ణుడు. ఇది ఎవరి పాక, ఎంత అందంగా ఉందోనన్నాడు కృష్ణుడు. ఈ మాట విన్న విదురుడు అది మీదేనన్నాడు. మీ కృపాకటాక్షాలతో హాయిగానే ఉన్నానిక్కడ. ఇక్కడ మీరడుగుపెడితే నా అంత అదృష్టవంతుడు మరొకడుండడన్నాడు విదురుడు. కనుక దయచేసి లోపలికి రండి అన్నాడు.
కృష్ణుడికి అంతులేని నందంతో విదురుడి పాకలోకి వెళ్లాడు. తీరా ఆ పాకలో పరమాత్ముడు కూర్చోడానికి కూడా తగిన ఆసనం లేదు. దర్భలతో చేసిన ఓ చాపను పరిచి దానిమీద కూర్చోమన్నాడు విదురుడు. మరుక్షణమే పరమాత్ముడు కూర్చున్నాడు. ఏమిటి విదురా, మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చాను. ఆకలేస్తోంది...తినడానికీ ఏమీ పెట్టరా అని అడిగాడు కృష్ణుడు.
ఉదయం గంజి మాత్రమే తాగడం అలవాటు....ఈరోజు అటుకుల గంజి ఉంది. కానీ అది మీకెలా ఇవ్వగలను అన్నాడు విదురుడు నెమ్మదిగా.
అయితే కృష్ణుడు ఏంటీ అటుకుల గంజా...ఏదీ... నాకది చాలా ఇష్టం విదురా...అన్నాడు.
వెంటనే విదురుడు ఓ గ్లాసులో గంజి పోసిచ్చాడు కృష్ణుడికి. దానిని అందుకున్న కృష్ణుడు ఆహా ఓహా అంటూ తాగాడు. అది చూసి విదురుడు ఆనందబాష్పాలు కార్చాడు. అది చూసి కృష్ణుడు ఆ కన్నీరేంటీ అని అడిగాడు.
పరమాత్మా, మీకు పాలూ, తేనెతో రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి ఆతిథ్యం ఇవ్వడానికి భీష్ముడు, ద్రోణుడు తదితరులు నిరీక్షించారు. కానీ మీరేమో ఈ పేదవాడి గంజి బాగుందంటూ తాగుతున్నారు...అన్నాడు విదురుడు.
అప్పుడు కృష్ణుడు ఓ నవ్వు నవ్వి వారందరూ ఆడంబర ప్రియులు. తమ తమ అంతస్తులనూ హోదానూ వెల్లడించుకోవాడినికే ఏర్పాట్లు చేసారు. వారి మాటల్లో నేను, నాది అనే అహంకారం కనిపిస్తోంది. కానీ మీరు మాత్రమే ఇది నీ ఇల్లు...అని అంటూ నన్ను స్వాగతించారు....గంజనే కాదు, మీరు ప్రేమతో ఓ చెంచాడు తీర్థం ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను...అని విదురుడిని ఆశీర్వదించాడు.
మనమూ మన మనసనే గూటిని కృష్ణుడి భవనంగా భావిద్దాం. మనకు చేతనైనది సమర్పిద్దాం. ఆయన ఎంతో ఆనందంగా మనలో ఉండి మనల్ని దీవించి ముందుకు నడిపిస్తారు.
-

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి