న్యాయాలు-869
న హి శాబ్ద మశబ్దేన న్యాయము
****
శాబ్ద అనగా మాట, శబ్దము,పదము,భాష. న హి శాబ్ద అనగా మాట లేకుండా.అశబ్దేన అనగా శబ్దము లేదా మాట లేదు అని అర్థము.
మాట లేకపోతే మాటల వల్ల కలిగే ఫలము కూడా కలుగదు.దీనినే" మాటకు మాట తెగులు - నీటికి నాచు తెగులు"అనే తెలుగు సామెతతో పోల్చవచ్చు..
మాటలు ఎక్కువగా మాట్లాడక పోతే ఏ సమస్యా లేదు. ఎందుకంటే మాటా మాటా పెరిగితే అది వివాదానికి దారి తీసే పరిస్థితి ఏర్పడుతుందనేది మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలే కారణం. ఒకోసారి ప్రాణాపాయం దాకా తీసుకుని వెళ్తాయి.అందుకే మాటలను చాలా పొదుపుగా వాడుకోవాలని మన పెద్దలు హితవు చెబుతుంటారు..
మాట్లాడే మాటల వల్లే ఇతరులకు మన మీద ఓ నిర్థిష్టమైన అభిప్రాయము కలుగుతుంది. పదము లేదా వాక్యమును మాట్లాడేటప్పుడు తేడాను తేలికగా గమనించవచ్చు.కోపంగా పలకొచ్చు- ప్రేమను ఒలికించ వచ్చు.మాటల్లో నిదానము , తీరు మనలోని వ్యక్తిత్వాన్ని బహిర్గత పరుస్తుంది.అందుకే అంటుంటారు మాటకున్న శక్తి,లౌక్యం మరిదేనికీ లేదు.
మాటలు అవసరమైన చోట తప్పకుండా మాట్లాడాలి. మనమంటే ఏమిటో ఋజువుకు మాటలే కారణం. కొంతమంది మాటల్లో చాతుర్యం, సందర్భానుసారంగా చలోక్తులు, సామెతలు, జాతీయాలు నిండుగా ఉండి వినడానికి ఎంతో మనోరంజకంగా ఉంటాయి.ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది .
ఇక కొందరి మాటల్లో విరుపు ఉంటుంది. ఇతరులు నొచ్చుకునే విధంగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంటారు. అలాంటి వారు ఎప్పుడు మాట్లాడినా వివాదాస్పదంగా మారుతుంటాయి. అందుకే మన పెద్దలు మాటకు మాట తెగులు - నీటికి నాచు తెగులు అంటుంటారు.మాట వల్లే మాటకు చేటు వస్తుంది.విలువలు నశిస్తాయి.అందుకే మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. నీటికి నాచు తెగులు అంటే నీటిని నిలువ ఉంచితే నాచు మొలిచి ఉపయోగపడకుండా పోతాయి.
అందుకే నీరు పారుతూ ఉండాలి. మాట నిలకడగా ఉండాలి.
ఇక ఒకోసారి ఎంత మంచిగా మాట్లాడినా ఇతరులు తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి చోట ఆచి తూచి ఆలోచించి మాట్లాడాలి.
మాటలు మాట తూటాలా ఉపయోగపడుతుంది. ఎదుటి గుండెల్లో సూటిగా దిగిపోతుంది.ఎన్నో అనర్థాలకు కారణం అవుతుంది.మాట పువ్వు లాంటిది కూడా. మృదువుగా మాట్లాడే మాట ఎదుటి వ్యక్తిలోని ఆందోళన,వ్యధలను తొలగించి ఓ గొప్ప భరోసాగా నిలుస్తుంది.
మొత్తంగా ఈ "న హి శాబ్ద మశబ్దేన న్యాయము" ద్వారా మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మాటలే లేకుంటే మాటల వల్ల పొందే ఫలితాలు పొందలేము. కాబట్టి మాట్లాడాలి. అలాగే ఈ క్రింది పద్యాన్ని సదా గమనంలో పెట్టుకోవాలి.
"వాక్కు కున్న పదును వాడి కత్తికి లేదు/ మార్చగలదు మాట మనిషి మనసు/ జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త/ శబ్దములకు గొప్ప శక్తి కలదు."
కాబట్టి మాటలను పొదుపుగా వాడుకుంటూ నొప్పించక, మనం నొవ్వకుండా ఒప్పించుకుని తిరుగుదాం.అవసరం లేని చోట అస్సలు మాట్లాడకుండా మౌనంగా ఉందాం. అవసరమైన చోట మాట సాయం చేస్తూ మమతల మల్లె తీగలా హృదయాలతో అల్లుకుపోదాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి