పలక బలపం ఇవ్వమ్మ
బడికి నేను వెళ్తానమ్మ
వద్దు వద్దు ఓ బిడ్డ
చేను పనికి రావమ్మా
స్నేహితులంతా వెళ్లారు
బడికి నేను వెళ్తానమ్మ
మారామ్ చేయకు ఓ బిడ్డా
అడవి పనులు నేర్వమ్మ
నేను చదువుకుంటానమ్మా
చక్కగ బడికి పంపించమ్మ
పనికి పోతే ఓ బిడ్డ
పావుల పైసలు ఇస్తారమ్మ
పావుల పైసలు వద్దమ్మా
పై చదువులు చదివించమ్మ
పెద్ద కొలువు నేను చేసి
మంచిగ చూసుకుంటానమ్మా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి