భాగవతంలో విశేషాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 పోతన ఆవులకి ఎంత అందమైన పేర్లు పెట్టాడో చదవండి.చిన్నికృష్ణుడు ఆవుల్ని ఇలా పిలిచాడు" ఓ పూర్ణచంద్రికా, గౌతమీ, సుధాజలరాశీ, మేఘబాలిక, మందమారుతి,శుభాంగి....ఇలా! అలాంటి పద్యాలు మనం నేర్పాలి.ఇక గార్ధభాసురుడనే రాక్షసుని చంపిన వాడు మాత్రము బలరాముడే! ఆరోజు గోపబాలురంతా అక్కడ పడున్న తాటిపండ్లకోసం పరుగెత్తారు.అది చూసిన రాక్షసుడు వారిపై దాడిచేయబోతుంటే బలరాముడు ఆగాడిద కాళ్లు పట్టుకుని గిరగిర త్రిప్పుతూ విసిరి తాటిచెట్టుపై పడేశాడు. అంతే వరుసగా అక్కడున్న తాటిచెట్లన్నీ టపటపా నేలకూలాయి.అంతే అమాయక బాలురంతా చిలోపొలో అని అరుస్తూ అవి ఏరుకుని తిని ఆనందించారు. ప్రకృతిమాత ప్రసాదించు ఫలాల్ని బాల్యంనుంచీ పిల్లలకు అలవాటు చేయాలి.పంచుకొని తినే బుద్ధి నేర్పాలి.ఇలా పద్యాలతో బాటు దైవ స్మరణ భక్తి అలవాటు చేయాలి🌷
కామెంట్‌లు