కడుము ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావును బుద్ధ పూర్ణిమ సందర్భంగా సత్కరించారు.
2569వ బుద్ధి పూర్ణిమ సందర్భంగా పాతపొన్నుటూరు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించారు. భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు బొడ్డేపల్లి కృష్ణారావు, ప్రముఖ అంబేద్కరిస్ట్ ముగడ మహేంద్ర కుమార్, పాతపట్నం రామరాజు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పారశెల్లి రామరాజు, స్ధానిక యువనేత ఎద్దు సంతోష్ కుమార్, విశ్రాంత వీఆర్వో బలగ అప్పారావునాయుడులు తిరుమలరావును బుద్ధ పూర్ణిమ కండువా వేసి, గౌతమబుద్ధుని జీవిత చరిత్ర గ్రంథాన్ని బహూకరించి సత్కరించారు. ఈ వేదికపై తిరుమలరావు వినిపించిన బౌద్ధమతం స్వీయ గీతం అందరి ప్రశంసలు పొందింది. గ్రామ సర్పంచ్ ఎద్దు చామంతమ్మ, ఉప సర్పంచ్ డోల చిన్నారావు, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ బలగ రజని, మాజీ విద్యా కమిటీ ఛైర్మన్ కొర్లాన సురేష్, పతివాడ కుసుమ, కుద్దిగాం లాస్య పతివాడ కేశవరావు, పి.నిర్మల, కుద్దిగాం ధనలక్ష్మి, పి.శేఖరరావు, అందవరపు చంద్రశేఖర్, కె.రవి, పి.ధరణి, పి.హరిణి, డోల దిలీప్, టెక్కలి నాని తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి