సాయినాధులు చేసే అపూర్వమైన, అద్భుతమైన లీలల వలన ఆయన ఖ్యాతి మహరాష్ట్ర లోనే కాకుండా యావత్ భారత దేశం లో విశేషం గా పాకిపోయింది. దేశం నలుమూలల నుండి లక్షల సంఖ్యలో భక్తులు నిత్యం శిరిడీకి వచ్చి శ్రీ సాయిని దర్శించుకునేవారు. ఆధ్యాత్మిక సిద్ధికి, లౌకికమైన కోరికల సిద్ధి కోసం ఇలా భక్తులు తమకు తోచిన విధం గా శ్రీ సాయిని ప్రార్ధించి తమ కోరికలను తీర్చుకొని అంతులేని ఆనందం తో తిరిగి వెళ్ళేవారు. శిరిడీకి వచ్చి శ్రీ సాయిని దర్శించి, తమ ఆలోచనా ధొరణిని మార్చుకొని ఆస్తికులుగా మారి తిరిగి వెళ్ళిన వారు ఎందరో వున్నారు. సాయిని గురించి విని, ఆయనను దర్శించకుండానే ఆయనపై అనుచిత విమర్శలు చేసిన వారు ఎందరో ! సాయి బ్రాహ్మణుడని, మహ్మదీయుడని, హిందూ , ముస్లిం సాంప్రదాయాలను కలగలిపి నాశనం చేస్తున్నాడని ఎందరో బాహాటం గా విమర్శించారు. మరి కొందరు శ్రీ సాయి హిందువో, ముస్లిమో తెలుసుకునే ప్రయత్నాలను తీవ్రం గా చేసారు. వారికి ఎప్పటికీ సమాధానం లభించలేదు. కారణం శ్రీ సాయి పరిపూర్ణ పరబ్రహ్మ అవతారం. ఈ కుల, మత , ప్రాంతీయ భేధాలు ఆయనకు అంటవు.హిందువు దేవాలయాలను అపవిత్రం చేస్తే శ్రీ సాయి సహించేవారు కాదు.
శిరిడీలో శిధిలావస్థలో వున్న శనేశ్వరుడు, గణపతి, శివ పార్వతుల ఆలయాలను తాత్యాకోటే పాటిల్ ద్వారా పునరుద్ధరింపజేసారు. అట్లే ఒక సంధర్భం లో సాయి భక్తాగ్రేసరుడు నానా చందోర్కర్ తన స్నేహితునితో కలిసి శిరిడీ వచ్చి శ్రీ సాయిని దర్శనం చేసుకొని ఆయన సన్నిధిలో కూర్చున్నారు. నానాను చూదగానే శ్రీ సాయి హఠాత్తుగా కోపించి “ నా సహవాసం ఇన్నేళ్లుగా చేస్తూ ఇంత మూర్ఖం గా ఎందుకు ప్రవర్తించావు ? అని అన్నారు. సాయి మాటలు అర్ధం కాక నానా “ నేను చేసిన తప్పేమిటో దయచేసి వివరించండి సాయి” అని హృదయపూర్వకంగా ప్రార్ధించాడు. అప్పుడు సాయి నానా చేసిన తప్పును వివరించి ఇంకెప్పుడూ అట్లా చేయవద్దని, చేసిన తప్పును మళ్ళీ చెస్తే తీవ్రమైన శిక్ష తప్పదని హెచ్చరించారు. జరిగిన విషయమేమిటంటే - శిరిడీకి వచ్చే ముందు నానా చందోర్కర్ సాధారణం గా కోపర్ గావ్ లో దిగి దత్త దర్శనం చేసుకునే వాడు. ఆ దత్త మందిరం లో వున్న పూజారి మందిర నిర్వహణ కోసం నానా చందోర్కర్ ను చందా అడిగాడు. మొదట్లో ఇస్తానని వాగ్దానం చేసిన నానా ఆ తర్వాత తప్పించుకు తిరగసాగాడు. ఆ పూజారి వ్రాసిన ఒక్క ఉత్తరానికి కూడా సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుత పర్యటనలో తన స్నేహితుడు దత్త బంధువైనప్పటికీ , దత్తాత్రేయుడిని దర్శనం చెసుకుందామని కోరినప్పటికీ వినకుండా ఆలశ్యమైపోతొందని సాకు చెప్పి కోపర్గాం వ్ లో దిగకుండానే శిరిడీకి వచ్చేసాడు నానా చందోర్కర్ . తాను చేసిన పని శ్రీ సాయికి తెలియదనుకున్నాడు నానా. గోదావరిలో దిగి స్నానం చేసేటప్పుడు ఒక ముల్లు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి