పేక మేడలు:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.
కల్పనలో ఎగసే కోటలు
వాస్తవంలో కూలే కలలు
మాయలో మునిగిన మనసులు
నిజంలో చిక్కిన బంధనాలు

చేతిలో చిక్కని చందమామలు
మిగిలిన ఆశల గుండెలు
పేకమేడల సౌందర్యం క్షణికం
అంతులేని కోరికలు శాశ్వతం

వాంఛల తామరలో వసంతం
నిలవరించలేము ఆసాంతం
కలల పేకమేడలు కల్లోల సముద్రం
ఒడ్డున మిగిలేది నిశ్శబ్ద హృదయం
________
   

కామెంట్‌లు