చదువుల తక్కెడ:- దండు ఆంజనేయరాజు, మాధవధార, విశాఖపట్నం,:8309340812
సాహితీ కవి కళా పీఠం,
సాహితీ కథలు #05,
==============-
 ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులైన విజయ,కృష్ణలకు..పెళ్లి అయి మూడు  సంవత్సరాలు అయింది. విజయ, కృష్ణ లకు.. రెండు సంవత్సరాల కొడుకు రియాన్స్ కోసం.. కోటి ఆశలు..శతకోటి కోర్కెలు..!!
  ప్రేమించి పెళ్లి చేసుకున్న  విజయ, కృష్ణలకు.. పుట్టిన రియాన్స్కి.. ఇంకా రెండు సంవత్సరాలు పూర్తి కాలేదు.
  "  రియాన్స్ ని ఏ స్కూల్లో.. వెయ్యాలి..?!"
అనేదే వారివురికి రియాన్స్ తపనతోనే..ఒక్కగాని ఒక్క కొడుకు రియాన్స్ ఆలోచనల తోనే.. రోజు లు యుగాలుగా గడుస్తున్నాయి.
   హైదరాబాద్ మహానగరంలో.. మనకు నచ్చిన స్కూల్లో వేయాలని ఉంటుంది.
 విజయ,కృష్ణలు ఉన్న మణికొండలో రెండు గదుల అపార్ట్మెంట్ అద్దె
ముప్పై వేలు.. ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులైన 
 కట్టింగ్స్ పోగా ఇద్దరికీ కలిపి వచ్చేది..మాత్రం
లక్షా ముప్పై వేలు.. ముప్పై వేలు అద్దెకు, పోగా ఇంకామిగిలిన లక్షలో..కృష్ణ పేరెంట్స్  కి.. నెల, నెలా పదిహేను వేలు మందులు కోసం తప్పకుండా పంపాలి.
పనిమనిషి, ఇంటి ఖర్చులకు.. కలిపి ఇంకో నలభై అయిదు వేలు, మిగిలిన నలభై వేలు తో.. విజయకు ఒక పది వేలు, కృష్ణకు పది వేలు పైగా.. పెట్రోల్కి పై పై ఖర్చులకి కలిపి  ప్రతిపైసా పొదుపు వాడితేనే.. సంసారం గోడుగా నడుస్తోంది.
 ఇంక మిగిలిన ఇరవై వేలు.. చుట్టు పక్కల పిల్లల పుట్టినరోజులకి..
 అనుకోని ఫ్రెండ్స్, రిలేషన్స్ పెళ్లిళ్లకు, పేరంటాలకు.. మిగిలిన ఇరవైవేలు..కూడా ఖర్చయిపోయి ఒక్క పైసా కూడా నెల నెలా పొదుపు చేయటానికి..
 విజయ, కృష్ణ లు పేరుకు సాఫ్ట్వేర్ ఉద్యోగులైన.. వచ్చే లక్ష 
ముప్పై వేలలో.. ఒక్క రూపాయి కూడా భవిష్యత్ కార్యక్రమాకై నా.. ఒక్కగాని ఒక్క కొడుకు
 రియాన్స్ చదువు కోసం..అయినా పొదుపు చేయలేక పోతున్నారు.
  రియాన్స్కి.. మూడో సంవత్సరం రాగానే..
 ఒక మంచి దగ్గర్లో ఉన్న కాన్వెంట్లో.. జాయిన్ చేయాలని LKG కి.. అని స్కూలు యాజమాన్యంను.. సంప్రదించారు. LKG కి..
సంవత్సరం స్కూల్ ఫీజు రెండు లక్ష్మలు, మరియు డొనేషన్కి ఇంకొక మూడు లక్షలు
అని అనగానే.. మూడు సంవత్సరాల ఒక్క గానీ ఒక్క కొడుకు రియాన్స్ LKG జాయిన్
చేయాలంటేనే మొత్తం అయిదు లక్షలు కావాలి.
విజయ,కృష్ణలిద్దరూ.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన చాలీచాలని జీతాలతో సొంతంగా ఒక అపార్ట్మెంట్ అయినా.. కొనుక్కోలేకపోయారు.
  విజయ,కృష్ణలు ఇద్దరూ ఉద్యోగాలు మీద అయిదు లక్షలు పర్సనల్ లోన్ తీసుకొని ఒక్కగాని ఒక్క కొడుకు రియాన్స్ను అయిదు లక్షలు కట్టి మరీ.. అనుకున్న కాన్వెంట్ లోనే. రియాన్స్ను చేరిపిస్తూ.. ఈ నాటి చదువులు "చదువుల తక్కెడ "లో మన లాంటి మధ్యతరగతి వాళ్ళము.. ఈ నాటి"చదువుల తక్కెడలో తూగలేము.. అనుకొంటూనే..మొత్తానికి విజయ,కృష్ణలు LKG కే తమకు స్థోమత లేకపోయిన చేరిపిస్తూనే వున్నారు..
 స్కూల్ యాజమాన్యాలు కూడా.. పిల్లలు చదువు ల తక్కెడలో తూగలేనంత లక్షల ఫీజులు వసూలు చేస్తూనే వున్నారు..!!
------------------- 

కామెంట్‌లు