బాల్యపు జ్ఞాపకాలు:- కోలా సత్యనారాయణ - విశాఖపట్నం - ఫోన్: 9676623939

 సాహితీ కవి కళా పీఠం
         సాహితీ కెరటాలు
===================
భూమ్మీద పడగానే శిశువు 'కేర్' మను,
నేనలా అనలేదు, 'మౌనరుషి' లా!
పొట్టపై చురకలు, సూదితో వేస్తుంటే,
కిమ్మన లేదట, నా సహనమెంతో!
ముంత మామిడి పండు మానాన్న తెస్తే,
చప్పుడు చేయక తింటినట, ఐదేళ్ళకే!
చీపురులో దాగున్న తేలు కుట్టితే నన్ను,
ఏడవక, వెర్రిగా చూస్తూ ఉన్నానంట!
పనస పండు విప్పి, పళ్ళెంలో తొనలుంచ,
ఎవరికీ తెలియకుండా, తింటినంట!
నిచ్చెన మెట్లెక్కి, అటకపై అరిసెలు,
తిటుంటే, నిచ్చెన జారి పడెనంట!
కోడి పుంజును పట్టి ,ముద్దాడుతుంటే,
కొరికె నా బుగ్గ ఆ పెంకి పుంజు.
తేలు తోకకు దారంబు కట్టేసి,
ఆడిన క్షణాలు గుర్తుకొచ్చే.
తురాయి పూలలో కొక్కేలు తగిలించి,
పుంజాట లాడిన రోజులెలా మరతు?
'కైపప్ప' అని అడిగేను దోశె ను,
'కక్కపచ్చడి' అంటూ 'కైమా' ను అడిగా!
బాల్యం స్మృతులు ఎన్నో గుర్తు, ఈనాటికి!!

కామెంట్‌లు