ఏరువాక పౌర్ణమి:- --గద్వాల సోమన్న, 9866414580
ఏరువాక పౌర్ణమి
ఘనంగా అరుదెంచెను 
రైతన్న మోములో
ఆశలు చిగురించెను

పుడమి తల్లి తలపై
మేఘాలు తలంబ్రాలు
ప్రేమగా వెదజల్లెను
హృదయాలు పులకించెను

హలం చేతపట్టెను
అన్నదాత నడిచెను
పొలం తల్లి పాదాలు
పట్టుకుని వేడుకొనెను

ఏరువాక సాగరో!
అంటూ గొంతు కలిపెను
గుండెలోని బాధను
గట్టు మీద పెట్టెను


కామెంట్‌లు