చీమ సందేశం:- --గద్వాల సోమన్న, 9866414580
 అందరినీ విమర్శిస్తే
మనశ్శాంతే దక్కేనా!
కన్నవారిని విస్మరిస్తే
జీవితాలు వర్ధిల్లేనా!

లోపాలను వెదకుతుంటే
సత్సంబంధాలు కుదిరేనా!
క్షమాగుణమే క్షీణిస్తే
పగ,ప్రతీకారాలు తగ్గేనా!

క్రమశిక్షణే లోపిస్తే
భవిష్యత్తు బాగుండేనా!
దురాలవాట్లు అలవడితే
సద్గుణాలే ఉదయించేనా!

రాగద్వేషాలకు తావిస్తే
సమైక్యత సిద్దించేనా!
కోపతాపాలు ఉద్భవిస్తే
ఆరోగ్యం చేకూరేనా


కామెంట్‌లు