సాహితీకవికళా పీఠం
సాహితీ కెరటాలు
===================
శృంగార హాస్యాలకు ఆనందంగా,
దుఃఖాలలో విచారంగా,
రౌద్ర వీరత్వాలలో ఉద్వేగంగా,
భయ బీభత్సాలలో వికారంగా,
అద్భుతాలలో ఆశ్చర్యంగా,
దయనీయ సమయాలలో కరుణతో,
నవరసాల పోషణ చేసేవే మానవ వాక్కులు.
వాక్కుల వాక్పటిమకు సర్వం సాధ్యమే!
వాక్కుల వాక్సుద్ధి స్వచ్ఛతను చేకూర్చు!
వాక్ విద్వత్తుకు సమూహమే ప్రవాహమై,
చారిత్ర సంఘటనలకు హేతువవుతుంది.
వాక్కునొదిలే ముందు మదికి పని చెప్పి,
వాక్కులను పొదుపుగా సంస్కరిస్తే,
అమృత వాక్కులకు ప్రణయాలు!
కుసంస్కార వాక్కులకు ప్రళయాలు!!
పెద్దల అనుభవ వాక్కులకు విలువనిచ్చి,
వాక్ నియంత్రణతో గొడవలకు గోడ కట్టి,
మనసులను ఆహ్లాదపరిచే వాక్కులతో,
వాక్ విద్వత్తుతో ఆనంద కడలికి చేరువవుదాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి