ప్రపంచ సుందరి...థాయ్ భామ మిస్ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ...:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్

(ఒక సౌందర్య వీరాంగన గాథ)

ఒకనాటి 
క్యాన్సర్ విజేత...
నేడు 85.56 
లక్షల వజ్ర కిరీటాన్ని 
8.5 కోట్ల ప్రైజ్ మనీని... 
దక్కించుకున్న "మిస్ వరల్డ్ 2025" విజేత...
21 ఏళ్ల థాయ్ లాండ్ ముద్దుగుమ్మ 
మిస్ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ...!

ఆమె ఒక జ్యోతి స్వరూపిణి...
అభినయం జెండా ఎగురవేసిన
కళల కెరటమే కాదు ఆమె...కన్న 
కలలను నిద్రలేపిన నవ్వుల నక్షత్రం..!

ఓపల్ ఆమె పేరు...
ఓదార్పే ఆమె ధ్యేయం...
"ఓపల్ ఫర్ హర్" అంటూ
చేసింది దాతృత్వపు దివ్య శపథం..!

వజ్రకిరీటాలకంటే 
వెలుగెక్కువ ఆమె చిరునవ్వుకు...
ఆమె క్యాన్సర్ బాధితుల ఆశాజ్యోతి...
ఆమొక సహజ సౌందర్య దేవతామూర్తి..!

థాయ్ ఆశయాలకు ప్రతీకగా నిలిచింది..
తెలుగునేలపై పరిమళాలను పంచింది...
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల....  
ఆలయాల శోభను తిలకించిన 108 దేశాల అందాల భామల మది పులకించింది...!

హైదరాబాద్ హైటెక్ హృదయంలో 
మూడు వారాల మాయాబజార్ లో
అందాల జాతరలో ఓపల్ 72 వ ప్రపంచ 
సుందరి సింహాసనాన్ని అధిరోహించింది...

జడ్జీల ప్రశ్నకు 45 సెకన్లలో నిగూఢ 
సమాధానమిచ్చింది నివ్వెర పరిచింది...
ప్రపంచానికి ఒక సత్య సందేశమిచ్చింది...
“దాతృత్వానికి మించింది లేదు” అంటూ 
అందరినీ అలరించింది ఆశలు పెంచింది..!

16 ఏళ్ళకే వ్యధల వ్రణం...కానీ 
21 ఏళ్లలో విజయ వీరవిహారం...
వేదనను విజయ గాధల వేదికగా 
మలచిన సమయస్ఫూర్తి ఆమెది
ఆమె జీవితం...ప్రతి యువతికి ఒకశక్తి 
ఒక అక్షర ప్రబోధం...ఒక స్పూర్తి ప్రదాత..!

ఒక బిడ్డ కన్నీటి వెనక ఓ తండ్రి ఆశ...
ఒక దేశగర్వం వెనుక ఓ సత్సంకల్పం..
ఓపల్...ర్యాంప్ వాక్ ఒక దీపోత్సవం...
ఆమె చిరునవ్వు ఒక ఆరని వెలుగుకిరణం..!

ఓ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ...
నీవు మిస్ వరల్డ్ మాత్రమే కాదు...
నీవు మిస్ కైండ్ హార్ట్ ...మిస్ గ్రేట్ హోప్...
మిస్ హ్యూమానిటీ ఫర్ ది ఎంటైర్ వరల్డ్..
జయహో ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ జయహో..! 


కామెంట్‌లు