ఒత్తి లేని ప్రమిదలో
నూనె ఎంతపోసి లాభమేమి..?
ప్రమిద నిండా నూనె ఉన్నా
ఒత్తి లేకపోతే దీపం వెలిగేదెలా..?
ఒత్తి...నూనె...రెండూ ఉన్నా
వెలిగించేందుకు అగ్గిపుల్లే లేకపోతే...?
ఇంట వెలుగెక్కడిది..?
ఒత్తి లేని కొవ్వొత్తి
తడిసిన అగ్గిపుల్ల ఉండీ లాభమేమి..?
ఒక్క మాటలో చెప్పాలంటే –
చుట్టూ కమ్ముకునేది చిమ్మ చీకట్లే..!
అన్నీ ఉన్నా...అల్లుడి నోట్లో శని ఉన్నట్లే..!
ఆ జీవితం అగ్నిగుండంలో లింగాభిషేకమే!
ఒత్తి, నూనె, ప్రమిద అన్నీ ఉన్నా
"సుబుద్ధి" అనే అగ్గిపుల్లతో
"జ్ఞాన దీపాన్ని" అంటించకపోతే…
ఆ జీవితం ఆరిపోయిన ఆశాజ్యోతియే..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి