అక్రూరుని వృత్తాంతం...అచ్యుతుని రాజ్యశ్రీ

 భాగవతంలో అత్యంత ముఖ్యమైన పాత్ర అక్రూరుడు మహా కృష్ణ భక్తుడు అతను కృతవర్మ కలిసి తమ మిత్రుడైన శతధన్వుడికి ఒక సలహా ఇస్తారు నీవు అంతఃపురం నీవు నిద్రపోతున్న సత్యభామ తండ్రి సత్రాజిత్తుని చంపి శమంతకమణిని తీసుకొని పో ఆ సలహా విని అతను శ్రీకృష్ణుడి మామ గారిని చంపుతాడు ఆపైన ఆ శమంతకమణిని అక్రూరు డి ఇంట్లో దాస్తాడు కృష్ణుడు తనను చంపుతాడని భయపడి అతను వారిని అడిగి ఈ పని చేశాడు ఇప్పుడు బలరాములు ద్వారకలో ఉన్నారు అందుకే ఆ ధైర్యం చేశాడు కానీ తరువాత అక్రూరుడు అతనిని నిందించాడు నీవు ఎందుకు సత్రాజితుని చంపావు అని నిలదీశాడు ఇక్కడ బలరాముడు మిథిలా నగరానికి వెళ్లి అక్కడ ఉంటున్నాడు అప్పుడు దుర్యోధనుడు అతని శిష్యుడుగా మారి గదా యుద్ధం నేర్చుకున్నాడు.కానీ అక్రూరుడు చాలా పశ్చాత్తాప పడతాడు.భగవంతుడైన కృష్ణుడికి  అన్యాయం చేశానని బాధ పడతాడు. అసలు అక్రూరుడు ఎవరు అని మనం తెలుసుకోవాలి కాశీ రాజ్యంలో వర్షాలు లేక జనం అలమటిస్తుంటారు అప్పుడు స్వభల్కుడు అనే మహర్షిని రాజు సాదరంగా ఆహ్వానించాడు. ఆయన రాకతో  వర్షాలు పడి కరువు పోయింది.ఆయన కొడుకే అక్రూరుడు.ఇక ద్వారకలో వర్షాలు పడటం లేదు అప్పుడు కృష్ణుడు అక్రూరుని ఆహ్వానించాడు కానీ ఒక మాట అడిగాడు నీవు శమంతకమణిని దాచావు దాన్ని నాకు ఒకసారి చూపించు ఎందుకంటే మా అన్న బలరాముడికి నామీద అనుమానం వస్తుంది నేనే శమంతకమణిని దాచుకున్నానని మనసులో వేదనపడతాడు మా అన్నయ్య దృష్టిలో నేను దొంగను కారాదు అందుకే నీవు మణిని చూపు దాన్ని నీ ఇంట్లోనే ఉంచుకొని పూజ చేస్తూ రోజు అది ఇచ్చే బంగారంతో యజ్ఞ యాగాలు నిరంతర హోమాలు అన్నదానాలు చేయి అప్పుడు అక్రూలుడు తన దుస్తులలో దాచిన మణిని చూపాడు ఈ విధంగా అతను తను చేసిన పనికి పశ్చాతాప పడ్డాడు అక్కురూరుడు మహాకృష్ణ భక్తుడు అతను ద్వారకకి రాగానే వర్షాలు పడి ఆ దేశం సస్యశ్యామలమైనది అంటే కృష్ణుడు స్వయంగా దేవుడు అయినా కూడా తన భక్తుని కాపాడటానికి తనపై పడిన నిందను తొలగించుకోటానికి అక్రూరిని అడిగాడు ఈ విధంగా భక్తులకు తాను లొంగి ఉంటానని కృష్ణ పరమాత్మ తెలియజేశాడు హిందీలో అక్రూరుడు మహా భక్తునిగా చిత్రింపబడ్డాడు సూరదాసు మీరాబాయి ఆయనని గొప్ప మహాత్మునిగా కృష్ణ భక్తునిగా కీర్తించారు🌹
కామెంట్‌లు