వింత పరిమళం :- పార్లపల్లినాగేశ్వరమ్మ-నెల్లూరు
సాహితీ కవి కళా పీఠం
=================
ఇవే, ఇవే కదా నవయవ్వనపు ఆనవాళ్లు!
చెక్కిళ్ల మందారాలు,
నులి సిగ్గుల సింగారాలు!

ఊహలతో పొంగిన గుండెలు,
చిలిపి చూపులతో కలిగిన చక్కిలిగింతలు!

హద్దులు లేని కమ్మని కలలు,
ఆ కలలో యువరాణిగా మురిసిన రాత్రులు!

రెక్కల గుర్రంపై ఆశగా యువరాజు కోసం పడిగాపులు...
ఇదే, ఇదే కదా తొలిప్రేమ...!

నిదురను దూరం చేసిన అతని రూపాలు,
నేల మీద నడవనివ్వని పాదాలు!

అద్దానికి దగ్గర చేసిన సొగసులు,
మూగబోయిన పెదాలు, మాటలాపని నయనాలు!

మండుటెండలు సైతం చల్లని వెన్నెలగా మారిన తీరులు,
ఊహల చాటున దాగిన కొత్త లోకం!

బయట పెట్టాలంటే, ఎదలో ఏదో కలవరం...
ప్రతి స్పర్శలో చెప్పలేని పరవశం!

గెంతులు వేసే మనసుకు వంతులు పాడే వయసు,
తోడు కావాలంటే తొందర పట్టే ఈడులు!

ఎదురుచూపులో మధురంగా కరిగే కాలాలు,
అవే కదా కొత్త వలపు తలపుల కులుకులు!


కామెంట్‌లు