రాజాం రచయితల వేదిక సభ్యులు కుదమ తిరుమలరావు కథారచయితగా అంతర్జాతీయ బాల కథా సమ్మేళనంలో, కథను వినిపించే ఘనమైన అవకాశం పొందారు.
ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షులు డా.కేశిరాజు శ్రీనివాస్ గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ముఖ్యసమన్వయకర్త డా.కేశిరాజు రామప్రసాద్ నేతృత్వంలో అంతర్జాలం ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో తిరుమలరావు పాల్గొని తన కథను వినిపించి అందరి ప్రశంసలు పొందారు. హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ తొలుత కథలను ఆహ్వానించగా తిరుమలరావు పంపిన మతలబ్ అనే కథను ఎంపికైంది. నూట ఏభై కథకులు ఐదు గంటలపాటు పర్యావరణం, నీతి, ప్రకృతి, తల్లిదండ్రులు, గురువులు, దేశభక్తి, సామాజిక హితం, సైన్స్, కాల్పనిక, సందేశాత్మక, హాస్యం వంటి ఇతివృత్తాలుగా బాల కథలను వినిపించగా అందులో తిరుమలరావు కూడా, తన కథరచనను వినిపించి మిక్కిలి అభినందనలు పొందారు. ఈ అంతర్జాతీయ బాల కథా సమ్మేళనంలో తిరుమలరావు కథలను వినడంతో పాటు ఆ కథలను చిన్నారులైన ఆలుగుబిల్లి చంద్రశేఖర్, ఎం.ప్రవళ్ళిక, రెడ్డి మోనిష్, అల్లు భావన, నల్ల సాయి ప్రశాంతి తదితర బాలబాలికలకు కూడా వినిపించి, ఆ కథలలో నీతిని వివరించారు. ఈనాటి సమ్మేళనంలో ప్రముఖ కథా రచయితలు డా.కె.రామప్రసాద్, పట్రాయిడు కాశీవిశ్వనాథ్, గుడిపూడి రాధికారాణి, డా.వి.పురుషోత్తం, పి.వెంకటేశ్వర్లు, వురిమళ్ళ సునంద, వంగా సుధీర్ మోహన్, శ్రీనివాసవంశీ, పుల్లా రామాంజనేయులు తదితరులు బాల కథా సాహిత్యం ఆవశ్యకతను వివరించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి