సమశీతోష్ణ స్థితులతో....
భూమి పచ్చగా ఉంటేనే
పసు,పక్ష్యాది సమస్త ప్రాణికోటికీ ఆనందం...!
ఆ ఆనందానికి ఆయువు పట్టు చెట్టు...!
ఆ చెట్లు సహజ సిద్ధంగా...
ప్రకృతి ప్రసాదించిన వరం
మనిషి తన అవసరాలకు అతిగా,మితిమీరి చెట్లను నరకటమే గాని....,
నరికిన చోటనే మరో మొక్కను నాటి సమతు
ల్యాన్ని కాపాడటం లేదే...!
పచ్చని చెట్టేగా ప్రగతికి మెట్టు..!
చెట్టు వలననే వర్షం...
వర్షం మూలం గానే అన్నం !
అన్నమే బలం,ఆరోగ్యం,ఐశ్వర్యం..!
చెట్లను నరుకుతూ...మొక్కలను నాటకపోగా...
నవ నాగరిక యాంత్రీ కరణ...!
తీవ్ర జల,వాయుకాలుష్యాలు..!
ఓజోన్ పొరకు చిల్లులు...
గ్లోబల్ వార్మింగ్..!
అతివృష్టి - అనావృష్టి ..
భూకంపాలు - జలప్ర లయాలు...!
తీవ్ర తాపంతో...
నీటి ఎద్దడితో...
బ్రతుకులు కకావికలం !!
ఓ మనిషీ... ఇకనైనా కళ్ళు తెరు...!
మొక్కలను విరివిగా పెంచు...!
కాలుష్యాలను నివారించు!
ఈ నేలను పచ్చదనంతో ఉంచు...!
సకల ప్రాణికోటికీ ఆనందాలను పంచు...!!
సర్వే జనాస్సుఖినో భవంతు...
సర్వే ప్రాణినాస్సుఖినో భవంతు....
లోకాసమస్తాస్సుఖినో భవంతు....
ఓం శాంతి శాంతి శాంతిః!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి