ఎప్పుడో అప్పుడు
ఉపయోగపడుతుందనే
ఉద్దేశముతో
ఏవేవో కొనేస్తుంటాం
కానీ
కొంత కాలం తర్వాత
అవేవీ పనికిరానివేనని
విసిరి కొడతాం
ఇలానే ఉంటుంది
కొందరితో పరిచయాలూ
చనువూ మాటలూ
కోటలు దాటుతాయి
తీరా ఓ క్షణాన
పాతాళానికి తొక్కెస్తారీ
మనుషులు
వాడుకున్నంతా వాడుకుని!!
ఇలాంటి వారిని
పసి కట్టడం తెలీకే
చిక్కులన్నీనూ
ఇందుకు
నేనేమీ అతీతుడ్ని కాను
నాలోనూ ఉన్నాయి లోపాలు
నాలోనూ ఉన్నాయి పాపాలు
అందుకే
ఓ మాట చెప్పాలని
ఉంది...
ఎవరినైనా
ఎలా ఉన్నావని అడిగితే
ఏదో మీ పుణ్యమాని
బాగున్నానని చెప్తే
అప్పుడు నేననుకుంటాను ఇలా...
నాకున్నదే
ఆవగింజంత పుణ్యం
అందులో అతనికెంత
దానం చేయాలా అని?!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి