సాహితీ కవి కళాపీఠ ం
===============
కమలాక్షణా! నీ కరుణా కటాక్ష వీక్షములకై నిరీక్షించుతున్నానయా,
నీ నామస్మరణ చేసి తరించుచున్నాను శివా..!
సర్వేజనా సుఖినోభవంతు... అనుచూ... సాగుతున్నానయా....!
పంచాశ్యుడు అయ్యావు కదా !నీవు కలిగి పంచముఖాలు,
నీ ఆధీనంలోనే నిరంతరము పంచభూతాలు,
నిత్యాయ.. శుద్దాయ. అన్నీ నీవాయే పంచాక్షరాలు.
కాలకూట విషధారి నీలకంఠ దే'వరా'
'వరా'లిచ్చి మము బ్రోవరా!
లోకుల పాప పుణ్యాలశోధనకై నిలిచావు, కాశీ క్షేత్ర పాలకుడవై. .!
మోక్షము నీ కటాక్షము కొరకే మా నిరీక్షణము.
పంచాక్షర పారాయణ శిక్షణ కదా! మోక్షదాయకము ..
సత్యము నిత్యమే కదా నీ కృత్యము నీ స్మరణే అనునిత్యము.
ఆత్మలింగ దర్శనమే సర్వదా మోక్షదాయకము.
కైలాసనాథ! క'పాలి' 'పాలిం'చు లాలించు మమ్ము
అమోఘమైన నీ మ'హిమ' 'హిమ'వర్షమై కురిపించు.
నా మది నిండా నీ భక్తి పర'వశం' '' 'వశం'అవుతాను నీకు జన్మంతం .
కమలాక్షణా!!కరుణా కటాక్ష వీక్షములకై నిరీక్షించుతున్నానయ్యా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి