చిరు కవితలు :- నామ వెంకటేశ్వర్లు స్కూల్ అసిస్టెంట్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అయిటిపాముల
 🌹 పుట్టుకతో బద్ధ శత్రువులేనేమో ఆకాశంలో సూర్య చంద్రులు 
 ఎప్పుడూ ఒకే దారిలో కలిసి నడవరు 
 🌹దరిద్ర దేవతకు పేదవాడoటే 
 చాలా ప్రేమ కావచ్చు నేమో...
 అందుకనే ఎప్పుడూ అతనిని విడిచి ఉండదు.
 అదృష్ట దేవతకు పేదవాడంటే
 మిక్కిలి విరోధమేమో కావచ్చు..
 అతని పంచనకెప్పుడు చేరదు 
ధనికునికి ప్రాణ స్నేహతుడేమో   అతని పంచనెప్పుడు  చేరదు 
🌹 దుమ్ము కు కూడా దమ్ముందని గాలితో పాటు పైకి లేచినప్పుడు తెలిసింది 
🌹 ఎండిపోయిన కాయలకు గాలంటే ఎంత వణుకో.. అందుకనే 
 గాలి రాగానే అవి గలగలమని మొత్తుకుంటాయి 
🌹 కరెంటు అంటే బల్బుకు ఎంత కోపమో..... స్విచ్ వేయగానే ముఖమంతా ఎరుపు చేసుకుంటుంది.
🌹 చుక్కలకు భయమవుతుందేమో..... అమావాస్యరాగానే ఎవరికీ కనిపించకుండా దాచుకుంటాయి 
🌹 ప్రాణ స్నేహితులైన 
 గాలి అగ్ని వీరిద్దరు కలిస్తే సమస్త భస్మం......
🌹 తను ఇలువైన వస్తువులను ఎక్కడ పోగొట్టుకుంటుందో కాకి.....
 ఏ వస్తువును చూపించినా....కావు, కావు, మంటుంది.
🌹 పుస్తకాలు అంటే ఎంత ఇష్టమో గాంధీ అంబేడ్కర్లకు 
 ఎల్లవేళల చేతుల్లోనే పట్టుకొని ఉంటారు.

కామెంట్‌లు