సుప్రభాత కవిత : - బృంద
పువ్వులు పరచిన దారిలో 
నవ్వులు నిలిపిన రేపటికి
మువ్వలు పలికే  గలగలల
సవ్వడి పిలుపులు ఆలించవే!

పచ్చగా ఊగుతూ నీ రాకకై 
పచ్చిక  వేచెను కనులింతలై 
వెచ్చగ తాకగ నీ అడుగులను 
ముచ్చట చూపులు గమనించవే!

వింజామరలై తనువూగగా 
వీవన తానై  నిను తాకగా 
వీచేను చల్లగ అలసట తీరగ
విచ్చిన శాఖల నాట్యము తిలకించవే!

నింగిని సాగే పాలమబ్బులు 
తొంగి నిను చూడగానేమో
వంగి నేలను చేరగా నెంచి 
చెంగట నిలిచేను చేయందించవే!

రాబోవు వేకువ తెచ్చేను
వేవేల కానుకలు నీకై 
వేగుచుక్క చెప్పెను కబురు
వేగముగా  మనసా మేలుకోవే...

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు