తూరుపు వెలిగించే
ఎరుపు ఏదో చెబుతోంది
కోరిన మనసుకు కొంత
ఊరట దొరికింది....
చీకటి తెర తొలగించి
రేపటి వెలుగు వచ్చింది
రెప్పలు తెరచిన కనులకు
రెక్కలు కొత్తగా తోచింది
వడివడి అడుగులు పడి
ఈ పయనం సాగేలా...
నడవడి మారి పోవాలని
ఓ చక్కని దారి చూపింది
దూరం బాగా తరిగేలా
చేరువగా గమ్యం తోచేలా
భారం కొంచెం తగ్గేలా
కోరి చెంతకు చెలిమి వచ్చింది
కనుచూపు మేరలో
కనువిందు చేస్తున్న
కమ్మని మజిలీ ఎదో
రా రమ్మని పిలుస్తోంది..
ఉదయ రాగం పాడుతూ
హృదయ విపంచి
ఎదను పొంగించి ప్రేమగా
ఎదిగి చూడమని చెప్పింది
మదికోరే మధుసీమల
పదిలంగా అందుకుని
కల వరమై దొరికే వేళ
ఇల స్వర్గం చేసే వేకువకు
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి