తగిన శాస్తి : - సరికొండ శ్రీనివాసరాజు



 రామాపురం ఉన్నత పాఠశాలలో అపర్ణ అనే అమ్మాయి ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేది. అపర్ణకు పోటీ లేనే లేదు. అదే తరగతిలో మాలినీ అనే అమ్మాయి చదువులో చాలా వెనుకబడి ఉండేది. చదువూ సున్నా. హోమ్ వర్కులు చేయదు. ఇంటివద్ద టీవీలు, సెల్ ఫోన్లు ఇవే మాలినీ ప్రాణ స్నేహితులు. 
     ఒకరోజు శ్రావణి టీచర్ హోం వర్క్ చేయలేదని మాలినిని బాగా తిట్టింది. క్లాస్ నుంచి బయటకు వెళ్ళగొట్టింది. అపర్ణను చూసి బుద్ధి తెచ్చుకోమని తిట్టింది. ఒకరోజు పొద్దున్నే విద్యార్థులు అంతా బయట ఉన్న సమయంలో మాలిని అపర్ణ హోం వర్క్ నోట్సును దొంగతనం చేసి, ఎక్కడో పారేసింది. ఆరోజు టీచర్ అందరి హోం వర్క్ నోట్సులు కలెక్ట్ చేసింది. అపర్ణ నోట్స్ లేదు. అపర్ణ కంగారు పడింది. 
       మాలిని తన హోం వర్క్ నోట్స్ చూపించింది. టీచర్ మాలినిని మెచ్చుకుంది. "అపర్ణ హోం వర్క్ చేయని కొంతమందిని ఎందుకు తిట్టడం లేదు టీచర్." అని అడిగింది మాలిని. "అది నీకు అనవసరం అన్నది టీచర్." "అంతేలే. మీకు కొంత మంది మీద విపరీతమైన ప్రేమ. అందుకే వారు తప్పు చేసినా తిట్టరు." అన్నది మాలిని. టీచర్ అంతకు ముందు రోజు చెప్పిన టాపిక్ మీద స్లిప్ టెస్ట్ పెట్టింది. అపర్ణ వంద శాతం కరెక్టుగా రాసింద జవాబులు. మాలిని తెల్ల కాగితం ఇచ్చింది. "ఇప్పుడు చెప్పు ఎవరిని తిట్టాలో." అన్నది శ్రావణి టీచర్. మాలిని సిగ్గుతో తల దించుకున్నది. 

కామెంట్‌లు