పల్లె, ప్రకృతి ప్రసాదించిన ముత్యాల ముల్లె.
పల్లే,ఓ పడుచు పిల్లలా ఉంటుందిచూడు.
చూడగా ఆ రుచులు (కాంతులు) పల్లె పడుచులకబ్బే.
పైరు, పచ్చనిచీర,
ఎర్ర తామరల రవిక,
వడ్లకంకులు, మెరిసేటీ వజ్రాల హారాలు,
పల్లెలో పారేటి పిల్ల కాలువలు
ఆ తల్లి కాలి మంజీర శబ్దాలు,
పొద్దున సూరీడు
ఎర్ర కుంకుమ బొట్టు,
పూ దోటలు, ఆతల్లి
తల పూలచెండ్లు.
పశుసంతతి,పల్లె తల్లి కన్న గారాలబిడ్డలు
పల్లె పడుచులు,పల్లె అందాలు అంది పుచ్చుకొన్నారు
నారునాటే వేళ
నడుము. వయ్యారాలు,
కలుపు తీసవేళ చేతి మెలకువలు,కుప్ప నూర్చేవేళ చూడాలి జోరు.
పల్లె పడుచుల
అందాలు నండూరి వారి ఎంకి పాటలలోన
నిండి ఉన్నాయి.
ఎంకి పాటలు మనము పాడుకుందాము.
కల్లా కపట మెరుగనీ
చల్లని చూపులవారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి