సాహితీ కవి కెరటాలు
================
దస్త్రమై సృజించెను నీ వలపులు !
వస్త్రమై నన్ను చుట్టెను నీ తలుపులు !
ప్రేమ ప్రయాణంలో ఎన్నో మలుపులు !
జీవితాంతం నీకోసమే నా పడిగాపులు....!
నిన్ను నిత్యం నేను స్మరిచాల్సిందే!
నిన్ను విస్మరిస్తే నా ఉనికిని కోల్పోయినట్లే !
నిన్ను సృజించకపోతే నాలో స్తబ్దత ఆవరించినట్లే ,...!
అందుకే కదా నువ్వు పంచప్రాణమై నిలచి నావు.....!
.
నిను మరువగ చాలదు ఈ జన్మమ్ !
నిను తలవక గడవదు కద కాలం !
నిను కలవక నిలువదు కద ప్రాణం!
నా కన్నుల్లో ఎన్నాళ్ళీ వానాకాలం!
గుండెనుకోసే గుర్తులెందుకొయ్!
గుండెగదుల్లోనువ్వేగుచ్చుతుండగా ...!
ఉక్కిరి బిక్కిరి ఊహలెందుకోయి. !
ఊపిరినువ్వై నన్ను సలుపుతుండగా. !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి